యువతకు స్పూర్తి: ఆర్మీకి ధోని సేవలందించడంపై ప్రశంసల వర్షం

హైదరాబాద్: భారత ఆర్మీకి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రెండు నెలలు పాటు తన సేవలందించడంపై మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, కపిల్ దేవ్‌లు స్పందించారు. తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కపిల్ దేవ్ మాట్లాడుతూ "ఆర్మీకి సేవలందించాలనుకున్న ధోని నిర్ణయం అభినందనీయం" అని అన్నాడు.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి చాలా ధైర్యం ఉండాలని... ఎక్కువ యూత్ ఫాలోయింగ్ ఉన్న ధోనిని ఆర్మీ దుస్తుల్లో చూసి యువత సైన్యంలోని పనిచేయాలనే భావన, స్పూర్తి కలుగుతుందని కపిల్ దేవ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
టీమిండియా మాజీ ఓపెనర్, ఎంపీ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ "ధోని తీసుకున్న నిర్ణయం స్పూర్థిదాయకం. ఇప్పటికే అనేకమార్లు ఆర్మీపై తనకున్న అభిమానాన్ని చూశాము. ఇప్పుడు తన నిర్ణయంతో ఆర్మీపై తనకున్న అంకితభావాన్ని చాటుకున్నాడు. ధోని లాంటి దిగ్గజం తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది యువత సైన్యంలో పని చేయాలన్న స్పూర్థిని కలిగిస్తుంది" అని అన్నాడు.
ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే, ధోనీ భారత ఆర్మీ పారాచూట్ రెజిమెంట్ విభాగంలో తన రెండు నెలల శిక్షణను గురువారం ప్రారంభించాడు. పారాచూట్ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని బుధవారం బెటాలియన్‌తో కలిసి లెఫ్టినెంట్ కల్నల్ బాధ్యతలు స్వీకరించాడు. కశ్మీర్‌లో ఉద్యోగం చేసేందుకు సిద్దమయ్యాడు.
జులై 31 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు 106 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌తో కలిసి ధోనీ పనిచేయనున్నాడు. కశ్మీర్‌లో ఉన్న విక్టర్ ఫోర్స్‌తో ధోనీ కలవనున్నాడు. అక్కడ పారాచూట్ రెజిమెంట్‌తో శిక్షణ ప్రారంభిస్తాడు. సైన్యం ప్రధాన కార్యాలయం నుంచి అనుమతి వచ్చాక ధోని పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ డ్యూటీలను ధోనీ నిర్వర్తించనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications