Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లాతో ఏకైక టెస్టు: కోహ్లీ సేన సరికొత్త రికార్డు

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌‌లో టీమిండియా అరుదైన ఘనతను సాధించింది. 380/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కోహ్లీ సేన తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వందలకు పైగా స్కోరు సాధించడం ద్వారా సరికొత్త రికార్డుని సాధించింది.

ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 147 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 4 వికెట్లు నష్టపోయిన 602 పరుగులు చేసింది. తద్వారా ఒకే ఇన్నింగ్స్‌లో వరుసగా ఆరు వందలకు పైగా స్కోరును సాధించిన తొలి జట్టుగా టీమిండియా అరుదైన ఘనత సాధించింది.

 Team India creates rare feat after 600 score of its first innings against bangladesh

భారత పర్యటనలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ జరిగింది. ఈ సిరీస్‌ను భారత్‌ 4-0తేడాతో దక్కించుకుంది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 631 పరుగులు చేసింది.

ఆ తర్వాత చెన్నైలో జరిగిన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 759 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. వరుసగా మూడు టెస్టు మ్యాచుల్లో 600పైగా పరుగులు నమోదు చేయడం క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి.ఈ రెండు టెస్టుల్లో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించడం విశేషం.

ఇదిలా ఉంటే బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌‌ తొలి ఇన్నింగ్స్‌లో టీ విరామానికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 620 పరుగులు చేసింది. బంగ్లాతో జరుగుతున్న టెస్టులో భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు. రెండో రోజైన శుక్రవారం ఆటలో భాగంగా కోహ్లీ డబుల్ సెంచరీ (204), రహానే 82 పరుగులు సాధించాడు.

వీరిద్దరూ అవుటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా కూడా సెంచరీ చేశాడు. ఇలా బంగ్లాతో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియాకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు మురళీ విజయ్ 108, విరాట్ కోహ్లీ 204, వృద్ధిమాన్ సాహా సెంచరీలు సాధించారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+