ఫోటోలు: 84 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డు
మొహాలి: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొహాలి వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 271/6 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 417 పరుగుల వద్ద ఆలౌటైంది.
దీంతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టుపై 134 పరుగుల ఆధిక్యాన్ని సాధించి మ్యాచ్‌పై పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా టీమిండియా ఓ అరుదైన మైలురాయిని తన ఖాతాలో వేసుకుంది. అదేంటంటే... బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏడు, ఆపై బరిలోకి వచ్చిన ఆటగాళ్లలో ముగ్గురు అర్ధ సెంచరీలను సాధించారు.

భారత్ అరుదైన ఘనత
ఇలా ఓ అరుదైన ఘనతను భారత్ తొలిసారి సొంతం చేసుకుంది. మొహాలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ 72 పరుగులతో అర్ధ సెంచరీని సాధించి స్టోక్స్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

రవీంద్ర జడేజా 90 అవుట్
ఆ తర్వాత ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 90 పరుగులతో అర్థశతకం సాధించాడు. అంతేకాదు తృటిలో సెంచరీ నమోదు చేసే అవకాశాన్ని కోల్పోయాడు. జయంత్ యావద్‌తో కలిసి జడేజా 80 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే తన కెరీర్‌లో 22వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న రవీంద్ర జడేజా టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుని నమోదు చేశాడు. అంతకుముందు జడేజా అత్యధిక టెస్టు స్కోరు 68గా ఉంది.

జయంత్ యాదవ్ 55
ఆ తర్వాత తొమ్మిదో స్థానంలో వచ్చి జయంత్ యాదవ్ 55 పరుగులతో అర్ధ సెంచరీని సాధించాడు. జయంత్ యాదవ్‌కి మొహాలి టెస్టు రెండో కావడం విశేషం. ఇలా ముగ్గురు ఏడో స్ధానం తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ముగ్గురు ఆటగాళ్లు ఒక టెస్టులో అర్ధ సెంచరీలు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

భారత్ 417 ఆలౌట్, ఆధిక్యం 134
మూడో టెస్టులో టీమిండియా 417 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌పై 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 90 పరుగులతో సెంచరీని నమోదు చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో జడేజా అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా మొహాలి టెస్టులో నమోదు చేశాడు. అంతకుముందు జడేజా అత్యధిక టెస్టు స్కోరు 68 కాగా ఉంది. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టోక్స్ 5 వికెట్లు తీసుకోగా, రషీద్ 4 వికెట్లు తీసుకున్నాడు.
జడేజా అత్యధిక వ్యక్తిగత
ఒకే ఇన్నింగ్స్‌లో 7,8,9 స్ధానాల్లో బ్యాటింగ్‌కు దిగిన రవిచంద్రన్ అశ్విన్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్‌లు అర్ధ సెంచరీలను సాధించారు.
జయంత్ యాదవ్‌కి మొహాలి టెస్టు రెండో కావడం
జయంత్ యాదవ్ 55 పరుగులతో అర్ధ సెంచరీని సాధించాడు. జయంత్ యాదవ్‌కి మొహాలి టెస్టు రెండో కావడం విశేషం. ఇలా ముగ్గురు ఏడో స్ధానం తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ముగ్గురు ఆటగాళ్లు ఒక టెస్టులో అర్ధ సెంచరీలు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications