300 పరుగులు: వన్డేల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన టీమిండియా
హైదరాబాద్: వన్డే క్రికెట్‌లో టీమిండియా సరికొత్త రికార్డుని సృష్టించింది. వన్డేల్లో అత్యధిక సార్లు 300కి పైగా పరుగులు చేసిన జట్టుగా టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతకముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు నమోదు చేసిన రికార్డుని టీమిండియా వెనక్కు నెట్టింది.
ఇంగ్లాండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం టీమిండియా వెస్టిండిస్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య శుక్రవారం జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆదివారం రెండో వన్డే జరిగింది.
ఆదివారం జరిగిన రెండో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 43 ఓవర్లలో 5 వికెట్లకు 310 పరుగులు చేసింది. దీంతో వన్డేల్లో అత్యధిక సార్లు 300కిపైగా పరుగులు సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. తాజా మూడొందలతో 96 సార్లు వన్డేల్లో 300కి పైగా పరుగులు సాధించింది.

ఆసీస్ రికార్డుని అధిగమించిన టీమిండియా
ఇప్పటివరకు ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును భారత్ అధిగమించింది. ఆస్ట్రేలియా 95 సార్లు మూడొందలకు పైగా స్కోర్లను సాధించగా, ఆ తర్వాతి స్ధానాల్లో దక్షిణాఫ్రికా(77), పాకిస్తాన్(69), శ్రీలంక(63), ఇంగ్లండ్(57), న్యూజిలాండ్(51)లు వరుసగా ఉన్నాయి.

రెండో వన్డేలో 105 పరుగుల తేడాతో ఘన విజయం
ఇదిలా ఉంటే ఆదివారం జరిగిన ఆదివారం జరిగిన రెండో వన్డేలో కోహ్లీ సేన 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్ అజింక్యా రహానే (103) సెంచరీతో చెలరేగగా, ధావన్(63) , కోహ్లీ (87) అర్ధ సెంచరీలతో రాణించారు.

వర్షం కారణంగా 43 ఓవర్లకు మ్యాచ్ కుదింపు
వర్షం కారణంగా మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించగా, కోహ్లీసేన 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్.. భారత్ బౌలర్ల దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. దీంతో వెస్టిండిస్‌పై టీమిండియా 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

వన్డేల్లో 300కు పైగా పరుగులు చేసిన జట్లు
96* ఇండియా
95 ఆస్ట్రేలియా
77 దక్షిణాఫ్రికా
69 పాకిస్థాన్
63 శ్రీలంక
57 ఇంగ్లాండ్
51 న్యూజిలాండ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications