కోల్‌కత్తా: ఐసీసీ వరల్డ్ టీ20లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. టీ20 ర్యాకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న భారత్, టోర్నీలో సెమీ ఫైనల్స్ పోటీలకు చేరుకోవాలంటే మార్చి 19 (శనివారం)న జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టోర్నమెంట్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓటిమి పాలైన సంగతి తెలిసిందే. భారత్-పాక్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ. ఇప్పుడు న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలవ్వడంతో ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
గౌరవం: భారత్-పాక్ మ్యాచ్‌లో బిగ్ బీ జాతీయగీతం
పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ అంటేనే ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిని తట్టుకుని భారత జట్టు విజయం సాధించకుంటే భారత్‌కు సెమీస్ అవకాశాలు కష్టమేనని క్రికెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సూపర్ 10లో భాగంగా గ్రూప్ 2లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు చెరో మ్యాచ్ విజయం సాధించగా... భారత్, బంగ్లాదేశ్‌లు ఓటమి పాలయ్యాయి.

గ్రూప్ స్టేజిలో 2.750 శాతం నెట్ రన్ రేటుతో పాకిస్థాన్ ఉండగా, భారత్ మైనస్ 2.350 నెట్ రన్ రేటుతో కొనసాగుతోంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కనీసం 50 పరుగుల తేడాతో నెగ్గితేనే మైనస్ రన్ రేటు నుంచి పాజిటిన్ రన్ రేటుకు చేరుకుంటుంది.
ఆ తర్వాత ఆస్టేలియా, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైతే, భారత్ నెట్ రన్ రేట్ ఇంకా పడిపోతుంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్తాన్‌పై మ్యాచ్ గెలిస్తేనే, సెమీస్ రేస్‌లో ఉంటుంది. లేదంటే టోర్నీ నుంచి భారత్ బయటకు వచ్చినట్లే.
మార్చి 19న జరగనున్న ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.