For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆరు మాసాల క్రితమే రవిశాస్త్రి సలహా.. పట్టించుకోని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ! చివరికి ఇలా!!

Team India Coach Ravi Shastri suggested Virat Kohli to give up ODI and T20I captaincy
Ravi Shastri Advised Virat Kohli To Quit ODI, T20I Captaincy || Oneindia Telugu

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తాను వైదొలగనున్నట్లు ఇటీవల భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు రోజుల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ బాధ్యతల నుంచి కూడా వైదొలగనున్నట్లు ప్రకటించి అందరిని ఆచర్యనికి గురిచేశాడు. అయితే ఐపీఎల్‌లో ఆడినన్ని రోజులు ఆర్సీబీ ఆటగాడిగానే కొనసాగుతానని స్పష్టం చేశాడు. కెప్టెన్సీ బాధ్యతల కారణంగా ఒత్తిడి ఎక్కువకావడం.. ఆ ప్రభావం తన ఆటపై పడుతున్నందునే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఆరు మాసాల క్రితమే:

ఆరు మాసాల క్రితమే:

అయితే వన్డేతో పాటు టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీకి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆరు మాసాల క్రితమే సలహా ఇచ్చాడట. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించిన అనంతరం శాస్త్రి.. కోహ్లీకి ఈ కీలక సూచన చేశాడట. బ్యాటింగ్‌పై పూర్తి దృష్టి పెట్టేందుకే వన్డే, టీ20 ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాలని సూచించాడట. అయితే టెస్ట్‌ క్రికెట్‌లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగాలని రవిశాస్త్రి సలహా ఇచ్చాడు. ఇటీవలి కాలంలో పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్న కోహ్లీమీ చూసి.. హెడ్ కోచ్ అలా చెప్పాడట. రవిశాస్త్రి సలహాను కోహ్లీ అప్పుడు పట్టించుకోలేదని సమాచారం.

న్డే కెప్టెన్‌గా మరింత కాలం:

న్డే కెప్టెన్‌గా మరింత కాలం:

రవిశాస్త్రి మాటలను పట్టించుకోని విరాట్ కోహ్లీ కేవలం టీ20 కెప్టెన్సీకి మాత్రమే గుడ్‌బై చెప్పాడు. ఇప్పటికీ టీమిండియా వన్డే కెప్టెన్‌గా మరింత కాలం కొనసాగాలని కోహ్లీ కోరుకుంటున్నాడని.. వన్డే కెప్టెన్సీ‌పై ప్రభావం చూపొద్దనే టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగినట్లు బీసీసీఐ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రవిశాస్త్రి సలహా మేరకు ఆరు నెలల క్రితమే కోహ్లీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు తీసుకుంటే.. అతని ఆటతీరు మెరుగ్గానే ఉండేదని వారు అంటున్నారు. ఇక కెప్టెన్సీ భారాన్ని తగ్గించి ఓ బ్యాటర్‌గా కోహ్లీ సేవలను మరింతగా సద్వినియోగం చేసుకోవడంపైనే బీసీసీఐ కూడా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ 2021 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటున్న విషయం తెలిసిందే.

2017లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా:

2017లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా:

2014లో ఎంఎస్ ధోనీ నుంచి విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీని అందుకున్నాడు. మూడేళ్ల పాటు వన్డే, టీ20ల్లో ధోనీ సారథ్యంలో ఎన్నో మెళుకువలు నేర్చుకున్నాడు. ఇక 2017లో టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా విరాట్ బాధ్యతలు చేపట్టాడు. మరో రెండేళ్ల పాటు మహీ అతడికి తోడుగానే ఉన్నాడు. ఈ నాలుగేళ్ల కాలంలో కోహ్లీ కెప్టెన్సీలో ఇప్పటి వరకూ కనీసం ఒక్క ఐసీసీ టైటిల్‌ని కూడా భారత్ జట్టు గెలవలేదు. మరోవైపు ఐపీఎల్‌లో రోహిత్ శర్మ తన సారథ్యంతో అందరిని ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌గా ముంబై టీమ్‌‌ని ఐదుసార్లు విజేతగా నిలిపి అందరిని ఆశ్చర్యపరిచాడు. దాంతో పాటు నిదహాస్ ట్రోఫీలోనూ కెప్టెన్‌గా భారత్ జట్టుని విజేతగా నిలిపాడు. అలానే గత రెండేళ్లుగా మైదానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి విలువైన సలహాలు ఇస్తూ.. భారత్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ ఇప్పుడు తప్పుకోవడంతో అందరూ రోహిత్ శర్మను సారథిగా చేయాలంటుంన్నారు.

Story first published: Thursday, September 23, 2021, 23:00 [IST]
Other articles published on Sep 23, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+