Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Jasprit Bumrah: ఆ బౌలర్ విషయంలో తొందర పాటు వద్దు.. ఛీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ..

 Team India chief selector Chetan Sharma said that there is no need to rush in the case of Jasprit Bumrah

న్యూజిలాండ్‌లో జరగబోయే మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భారత కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత నవంబర్ 18న వెల్లింగ్టన్‌లో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 25 నుంచి న్యూజిలాండ్‌లో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో భారత జట్టుకు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రెండు సిరీస్‌లలో రిషబ్ పంత్ న్యూజిలాండ్‌లో జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్ తో జరిగే వన్డే, టీ20 మ్యాచ్ లకు ఎంపికయ్యాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఓపెనర్ KL రాహుల్, కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్, వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లకు న్యూజిలాండ్ పర్యటనకు విశ్రాంతినిచ్చారు. బంగ్లాదేశ్‌లో జరిగే వన్డే, టెస్టు సిరీస్‌లలో రోహిత్ తిరిగి జట్టులోకి రానున్నాడు. డిసెంబర్ 4 నుంచి భారత్ బంగ్లాదేశ్ తో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. బంగ్లాదేశ్ పర్యటనలో స్టార్ బ్యాటర్ కోహ్లీ, అశ్విన్ కూడా తిరిగి జట్టులోకి రానున్నారు. బీసీసీఐ ఒకేసారి నాలుగు జట్లను ప్రకటించడం ఇదే తొలిసారి. ఆసియా కప్‌లో మోకాలి గాయంతో జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా కూడా జట్టులోకి రానున్నాడు.

ఏదేమైనప్పటికీ, స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా ఏ జట్టులోనూ చోటు దక్కించుకోలేదు. బుమ్రా పై పని భారాన్ని దగ్గించేందుకే ఎంపిక చేయలేదని ఛీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ చెప్పారు. వెన్ను గాయం కారణంగా బుమ్రా T20 ప్రపంచ కప్ నుంచి వైదొలిగాడు. దీంతో అతని స్థానంలో మహ్మద్ షమీ జట్టులో చేరాడు. "ఖచ్చితంగా, నేను ప్రతిసారీ చెబుతాను, మనం ఆటగాళ్లను గాయాల పాలు అవ్వకుండా చూసుకోవాలి. మేము తొందరపడ్డాము. జస్ప్రీత్ బుమ్రా కొంచెం సమయం ఇచ్చేది ఉండే. ప్రపంచ కప్ కోసం అతని ఎంపిక చేస్తే ఏమైందో చూశారు" అని చీఫ్ సెలెక్టర్ అన్నారు.

Story first published: Tuesday, November 1, 2022, 11:07 [IST]
Other articles published on Nov 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+