క్రికెట్ ఫీవర్‌తో అభిమానులు ఊగిపోతున్నారు. ఆసియా కప్‌తో పాటు, అక్టోబర్ నెల్లో ప్రపంచ కప్ కూడా మొదలు కానుండటంతో దేశంలో క్రికెట్ సందడి కనిపిస్తోంది. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఇండియా మ్యాచులు ఉన్నాయా అని అతృతుగా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఆసియా కప్‌కు పాకిస్థాన్ అతిథ్యం ఇస్తుండగా.. ఇండియాతో జరిగే మ్యాచులను శ్రీలంక దేశంలో నిర్వహించనున్నారు. తరువాత జరిగే ప్రపంచ కప్ స్వదేశంలో జరగనుండటంతో.. టీమిండియాపై తీవ్ర ఒత్తడి నెలకొంది. 2011 ప్రపంచ కప్ తరువాత ఇప్పటి వరకూ ఒక్క ఐసీసీ టైటిల్ కూడా టీమిండియా గెలవలేకపోయింది.
ప్రపంచ కప్‌ను గెలవడానికి టీమిండియాకు ఇదే సరైన అవకాశమని మాజీ ఆటగాళ్లు చెబుతున్నారు. కాని వాస్తవ పరిస్థితి దానికి విరుద్దంగా ఉంది. టీమిండియాకు కప్ గెలిచేంత సామర్థం లేదని పలువురు ఆటగాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆసియా కప్, ప్రపంచ కప్‌ల ముందు కీలక ఆటగాళ్లు ఎవరూ కూడా ఫామ్‌లో ఉన్నట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, మాజీ కెప్టెన్ కోహ్లి అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. బౌలింగ్ విభాగం కూడా బలంగా లేదు.

ముఖ్యంగా టీమిండియా రోహిత్ శర్మ స్థాయికి దగ్గ పదర్శన ఇవ్వడం లేదు. కెప్టెన్‌గా విజయవంతం అయిన రోహిత్ , వ్యక్తిగత ఫర్మామెన్స్‌కు వచ్చే సరికి తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 2023లో 9 వన్డే మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ , 9 ఇన్నింగ్స్‌ల్లో 383 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 1 సెంచరీతో పాటు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో రోహిత్ స్ట్రైక్ రేట్ బాగానే ఉన్నప్పటికి సగటు మాత్రం అభిమానులను కలవరపెడుతుంది. వన్డేల్లో రోహిత్ శర్మ సగటు 50 దాటలేదు. రెండు కీలక టోర్నిల ముందు రోహిత్ శర్మ ఫామ్‌లోకి వస్తే.. టీమిండియాకు తిరుగుండదని అభిమానులు ఆశిస్తున్నారు.

కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ తొలుత తాను రాణించి ఒత్తిడి తగ్గిస్తే..తరువాత క్రీజ్‌లోకి వచ్చే ఆటగాళ్ల పని ఈజీ అవుతుంది. ఈ రెండు టోర్నీల్లో రోహిత్ ప్రదర్శన మీదనే టీమిండియా భవిత్వం ఆధారపడి ఉంది. ఒకవేళ రోహిత్ కనుక ప్రపంచ్ కప్‌లో ఫెయిల్ అయితే.. మనోడు కెరీర్ కూడా డెంజర్ జోన్‌లో పడినట్టే. వచ్చే ప్రపంచ కప్ సమయానికి జట్టులో రోహిత్ ఉండటం కష్టంగానే కనిపిస్తుంది. మరి రోహిత్ బ్యాట్‌తో రాణించి .. విమర్శలకు చెక్ పెడతాడేమో చూడాలి.