Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెలరేగిన ఆసీస్ స్పిన్నర్లు: భారత్‌లో కోహ్లీ చెత్త రికార్డు

హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా పూణెలో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌పై 333 ప‌రుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో టీమిండియా ఓటమిపాలైన తొలి టెస్టు మ్యాచ్ ఇదే.

సొంతగడ్డపై ఓటమి లేకుండా సాగుతున్న భారత్‌ జోరుకు బ్రేక్‌ పడింది. అంతేకాదు 20 టెస్టుల తర్వాత భారత్‌కు ఇది తొలి పరాజయం కావడం విశేషం. ఈ టెస్టు విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 తేడాతో ఆధిక్యాన్ని సాధించింది. ఈ టెస్టు విజయంతో 12 ఏళ్ల తర్వాత భారత్‌లో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ గెలిచింది.

తన అద్భుత బ్యాటింగ్‌తో ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజా ఓటమితో ఓ చెత్త రికార్డుని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పూణెలో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ చేసిన మొత్తం పరుగులు 13. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.

దీంతో స్వదేశంలో విరాట్ కోహ్లీకి ఇదే అత్యంత చెత్త ప్రదర్శన. ఇప్పటివరకు ఓ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ ఇంత తక్కువ స్కోరుని ఎప్పడూ నమోదు చేయలేదు. దీంతో స్వదేశంలో కోహ్లీ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆసీస్ స్పిన్న‌ర్లు ఓకీఫ్‌, లియాన్‌లు భార‌త్ బ్యాట్స్‌మెన్‌ను మ‌ట్టిక‌రిపించారు.

మూడు రోజుల్లోనే ముగించిన ఆసీస్

మూడు రోజుల్లోనే ముగించిన ఆసీస్

ఐదు రోజులు జరిగాల్సిన ఈ టెస్టును ఆస్ట్రేలియన్లు కేవ‌లం మూడు రోజుల్లోనే ముగించారు. స్పిన్నర్లు ఓకీఫ్‌, లియాన్‌లు రెండో ఇన్నింగ్స్‌లో భారత మొత్తం వికెట్ల‌ను తీశారు. ఓకీఫ్‌కు ఆరు వికెట్లు తీసుకోగా, లియాన్‌కు నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా ఈ టెస్టులో ఓకీఫ్ 12 వికెట్లు తీసుకోగా, లియాన్ ఐదు వికెట్లు తీశాడు.

టీమిండియా ఘోర ఓటమి

టీమిండియా ఘోర ఓటమి

పూణె టెస్టులో టీమిండియా ఘోరంగా ఓటమి పాలైంది. భారత్‌పై ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 441 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 33.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. పూణె టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ ఓకీఫ్ 12 వికెట్లు తీసుకుని చరిత్ర సృష్టించాడు.

1-0తో ఆధిక్యంలో నిలిచిన ఆస్ట్రేలియా

1-0తో ఆధిక్యంలో నిలిచిన ఆస్ట్రేలియా

దీంతో నాలుగు టెస్టుల సిరిస్‌లో 1-0తో ఆస్ట్రేలియా ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాట్స్‌మెన్లలో పుజారా చేసిన 31 పరుగులే అత్యధికం. ఇక మురళీ విజయ్ 2, రాహుల్ 10, కోహ్లీ 13, రహానే 18, అశ్విన్ 8, సాహా 5, యాదవ్ 5, జడేజా 3 పరుగులు చేశారు.

333 పరుగుల తేడాతో ఘన విజయం

333 పరుగుల తేడాతో ఘన విజయం

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకే ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా 105 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 155 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్ విషయానికి వస్తే ఆసీస్ 285 పరుగులు చేయగా, భారత్ 107 పరుగులకే ఆలౌటైంది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+