విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం.. 1980కి కపిల్‌ దేవ్‌, 1990కి సచిన్‌ ఎంపిక!!

లండన్‌: టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. వన్డేల్లో గత కొన్నేళ్లుగా అత్యుత్తమంగా రాణిస్తున్న కోహ్లీ.. విజ్డెన్‌ అల్మానక్స్‌ 2010 దశాబ్దపు వన్డే క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. భారత దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్, కపిల్‌ దేవ్‌ కూడా విజ్డెన్‌ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్ ‌స్టోక్స్‌ 'ప్రపంచ అగ్రగామి క్రికెటర్'గా వరుసగా రెండో ఏడాదీ ఘనత సాధించాడు. తొలి ఇంటర్నేషనల్ వన్డే జరిగి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా విజ్డెన్.. అప్పటి నుంచి దశాబ్దానికి ఒకరు చొప్పున ఆటగాళ్లని ఎంపిక చేసింది.

ఆ వన్డేకు 50 వసంతాలు:

ఆ వన్డేకు 50 వసంతాలు:

'తొలి అంతర్జాతీయ వన్డే జరిగి 50 వసంతాలు పూర్తైన సందర్భంగా ఐదుగురు క్రికెటర్లను 2021 విజ్డెన్‌ క్రికెటర్స్‌ అల్మానక్‌ సంచికకు ఎంపిక చేశాం' అని విజ్డెన్ ఓ ప్రకటనలో‌ తెలిపింది. 970-80 దశాబ్దానికి వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ఎంపికయ్యాడు. 1980-90 దశాబ్దానికి భారత దిగ్గజం కపిల్‌ దేవ్‌కి ఈ గౌరవం దక్కింది. 1990-2000 దశాబ్దానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎంపికవగా.. 2000-2010 దశాబ్దానికి శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్ మురళీధరన్‌కి ఈ గౌరవం దక్కింది. ఇక 2010-2020 దశాబ్దానికి విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు.

లీడింగ్‌ క్రికెటర్‌గా స్టోక్స్:

లీడింగ్‌ క్రికెటర్‌గా స్టోక్స్:

బెన్‌ స్టోక్స్‌ను వరుసగా రెండో ఏడాదీ ప్రపంచంలోనే అగ్రగామి (లీడింగ్‌) క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. 'స్టోక్స్ గతేడాది అందరి కన్నా ఎక్కువగా టెస్టుల్లో 58 సగటుతో 641 పరుగులు చేశాడు. 19 వికెట్లూ తీశాడు. తండ్రి మరణించినా, వ్యక్తిగతంగా ఇబ్బందులున్నా అతడీ ఘనత సాధించడం విశేషం' అని విజ్డెన్‌ తెలిపింది. డామ్‌ సిబ్లీ, జాక్‌ క్రాలీ, జేసన్ హోల్డర్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, డారెన్‌ స్టీవెన్స్‌ను 2021 ఎడిషన్‌కు విజ్డెన్‌ ఈ ఏడాది క్రికెటర్లుగా గుర్తించింది.

వన్డేల్లో 12169 పరుగులు:

వన్డేల్లో 12169 పరుగులు:

విరాట్‌ కోహ్లీ 2008, ఆగస్టులో శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి కోహ్లీ అన్ని ఫార్మాట్లలలో పరుగుల వరద పారిస్తూనే ఉన్నాడు. 254 వన్డేలాడిన కోహ్లీ ఏకంగా 12169 పరుగులు సాధించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ ఆడిన కోహ్లీ.. పదేళ్ల కాలంలో 60కి పైగా సగటుతో 11000 పైచిలుకు పరుగులు చేశాడు. వీటిలో 42 శతకాలూ బాదేయడం గమనార్హం. ఇక టెస్ట్, టీ20ల్లో కూడా విరాట్ పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. టెస్టుల్లో 7490, టీ20ల్లో 3159 రన్స్ బాదాడు.

49 శతకాలు, 96 అర్ధ శతకాలు:

49 శతకాలు, 96 అర్ధ శతకాలు:

ప్రపంచ క్రికెట్లో సచిన్‌ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్లో 463 వన్డేలాడిన సచిన్ 44.83 సగటుతో 18426 పరుగులు చేశాడు. 49 శతకాలు, 96 అర్ధ శతకాలు సాధించాడు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఒక్క ఏడాది (1998లో)లో ఏకంగా 9 వన్డే శతకాలు చేశాడు. కపిల్‌ దేవ్‌ భారత్‌కు తొలిసారి వన్డే ప్రపంచకప్‌ అందించాడు. 1980వ దశకంలో అత్యధిక వికెట్లు పడగొట్టడమే కాకుండా 1000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్ సాధించడం విశేషం.

రైనాకు రెండు సిక్సులు, రాహుల్‌కు 67 రన్స్, ధోనీకి 2 ఔట్‌లు! ఈ త్రయం బద్దలు కొట్టనున్న రికార్డులు ఇవే!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, April 16, 2021, 17:54 [IST]
Other articles published on Apr 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X