న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రారంభమైన ఆరో దశ పోలింగ్: ఓటేసిన విరాట్ కోహ్లీ

Team India captain Virat Kohli cast his vote in NCR

హైదరాబాద్: దేశవ్యాప్తంగా 6 విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హర్యానాలోని అన్ని స్థానాలకు 6వ విడతలోనే పోలింగ్ జరగనుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హర్యానాలోని గురగ్రామ్‌లో గల పైన్‌క్రెస్ట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో విరాట్ కోహ్లీ క్యూలైన్‌లో నిలబడి ఓటేశారు.

భోపాల్‌లో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, ఢిల్లీలో కేజ్రీవాల్, మాజీ క్రికెటర్, బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ తదితరులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరవ విడత పోలింగ్‌లో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. మేనకా గాంధీ, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్, అతిషి, గౌతం గంభీర్, సాద్వీ ప్రగ్యా, దిగ్విజయ్ సింగ్‌లు పోటీలో ఉన్నారు.

మొత్తం బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 979 ఉండగా ఒక్క హర్యానాలోనే 223 మందిఅభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీహార్‌లో 8 స్థానాలు, ఢిల్లీ ఎన్సీటీలో 7 స్థానాలు, హర్యానాలో 10 స్థానాలు, జార్ఖండ్‌లో 4 స్థానాలు, మధ్యప్రదేశ్‌లో 8స్థానాలు, ఉత్తర్ ప్రదేశ్‌లో 14 స్థానాలు, పశ్చిమ బెంగాల్‌లో 8 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

Story first published: Sunday, May 12, 2019, 10:08 [IST]
Other articles published on May 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X