T20 World Cup 2022: సిక్సర్ల కింగ్‍గా రోహిత్ శర్మ.. హాఫ్ సెంచరీతో టచ్‍లోకి వచ్చిన కెప్టెన్..

టీ20 వరల్డ్ కప్ నెదర్లాండ్స్ తో జరుగుతున్న సూపర్-12 మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. 39 బంతుల్లో 3 సిక్స్ లు, 4 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. చివరికి ఫ్రెడ్ క్లాసెన్ బౌలింగ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు రోహిత్ శర్మ వరల్డ్ కప్ అత్యధిక సిక్స్ లు కొట్టిన భారత ఆటగాళ్లలో మొదటి స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ 34 సిక్స్ లతో ప్రథమ స్థానంలో ఉండగా.. యువరాజ్ సింగ్ 33 సిక్స్ లతో రెండో స్థానంలో ఉన్నాడు. కింగ్ కోహ్లీ 24 సిక్స్ లతో మూడో స్థానంలో ఉన్నాడు.
కేఎల్ రాహుల్
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ 9 పరుగులకే ఔట్ అయ్యాడు. కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ వేగంగా ఆడాడు. ఎక్కువగా సిక్స్ లు కొట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతను రెండు సార్లు తప్పించుకున్నాడు. నెదర్లాండ్స్ ఫీల్డర్లు రెండు సార్లు రోహిత్ శర్మ క్యాచ్ మిస్ చేశారు. మూడోసారి మాత్రం రోహిత్ క్యాచ్ ను పట్టుకున్నారు. కాగా గత మ్యాచ్ లో భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది.
పాకిస్థాన్
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా భారత్ ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన ఉత్కంఠ పోరులో విజయం సాధించింది.ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లను హర్ష్ దీప్ త్వరగానే పెవిలియన్ చేర్చాడు. కానీ ఆ తర్వాత వచ్చిన షాన్ మసూద్, ఇఫ్తికార్ జట్టును ఆదుకున్నారు. షాన్ మసూద్ 42 బంతుల్లో 5 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. ఇఫ్తికా అహ్మద్ 34 బంతుల్లో 4 సిక్స్ లు, 2 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. చివర్లో షహీన్ షా అఫ్రిదీ 8 బంతుల్లో 16 పరుగులు చేశాడు.
విరాట్ కోహ్లీ
160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహల్ తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందొచ్చిన అక్షర్ పటేల్ రనౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. కానీ వేగంగా ఆడే క్రమంలో హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. కానీ కోహ్లీ ఒంటి చేతితో మ్యాచ్ ను గెలిపించాడు. కోహ్లీ 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications