
నెదర్లాండ్స్ పై గెలుపు మరింత ఆత్మవిస్వాన్ని పెచిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. అయితే నెదర్లాండ్స్ ఆటగాళ్లు బాగా ఆడారని చెప్పాడు. "వారు సూపర్ 12కు అర్హత సాధించిన తీరు చూస్తే క్రెడిట్ వారికే దక్కుతుంది. మేం ప్రారంభంలో కొంచెం నెమ్మదిగా ఆడాము. నా హాఫ్ సెంచరీతో సంతోషంగా లేను" అని రోహిత్ వివరించాడు.
సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ "నేను బ్యాటింగ్‌కు దిగినప్పుడు నా ఆటను ఆడేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను ఆ సమయంలో వేగం పెంచాల్సి వచ్చింది. మేము ఓవర్‌కి 8-10 పరుగులు చేయాల్సి వచ్చింది. కోహ్లీ బ్యాటింగ్ చేయడం నిజంగా ఆనందిస్తున్నాము, మేమిద్దరం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి" అని సూర్య చెప్పాడు.
విరాట్ కోహ్లీ
కాగా ఈ మ్యాచ్ లో భారత్ 56 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 2 సిక్స్ లు, 3 ఫోర్లతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవు కూడా హాఫ్ సెంచరీ చేశాడు. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 25 బంతుల్లో ఒక సిక్స్, 7 ఫోర్లతో 51 పరుగులతో అజేయంగా నిలిచాడు. రోహిత్ శర్మ 39 బంతుల్లో 3 సిక్స్ లు, 4 ఫోర్లతో 53 పరుగులు చేశాడు.