Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS AUS: ఇండియాకు షాక్.. కీలక ఆటగాడికి గాయం..!

బాక్సింగ్ డే టెస్ట్ కు ముందు భారత జట్టకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. డిసెంబర్ 22న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మోకాలికి దెబ్బ తగిలింది. త్రోడౌన్ స్పెషలిస్ట్ దయా వేసిన డెలివరీ అతని ఎడమ కాలికి తగిలింది. బాల్ తగిలిన వెంటనే రోహిత్ నెట్స్ వదిలి వెళ్లాడు. వైద్యుడికి చూపించికున్నాడు. ఫిజియో ప్రభావిత ప్రాంతాన్ని ఐసింగ్ చేస్తూ కనిపించాడు.

అయితే అది పెద్ద గాయంలా కనిపించడం లేదని తెలుస్తోంది. రోహిత్ మోకాలికి దెబ్బ తగలగానే.. సహచరులు అతనిని చుట్టుముట్టినట్లు కనిపించింది. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొదటి టెస్ట్ లో రోహిత్ ఆడలేదు. మొదటి టెస్ట్ కు జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించారు. ఆ తర్వాత జరిగిన రెండో నుంచి రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. అయితే రోహిత్ రెండు టెస్ట్ ల్లో ఆకట్టుకోలేదు. అతను ఇప్పటివరకు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో నాలుగు మూడు ఇన్నింగ్స్ ల్లో 3, 6, 10 పరుగులు చేశాడు.

Team India captain Rohit Sharma reportedly suffered a knee injury while practicing in the nets

ప్రైమ్ మినిస్టర్స్ XIతో జరిగిన పింక్-బాల్ వార్మప్ గేమ్‌లో రోహిత్ సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటయ్యాడు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఒక టెస్ట్ గెలవగా.. ఆసీస్ ఒక టెస్ట్ లో విజయం సాధించింది. గబ్బా టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్ 1-1తో సమమైంది. నాలుగో టెస్టు డిసెంబర్ 26న ఎంసీజీలో ప్రారంభం కానుంది. రోహిత్ చివరిసారిగా MCGలో టెస్టు ఆడినప్పుడు అతను 63 నాటౌట్ గా నిలిచాడు. 2018లో MCG టెస్ట్‌లో భారత్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది.

బ్రిస్బేన్‌లో జరిగిన మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రోహిత్ తాను మంచి ఫామ్‌లో లేనని అంగీకరించిన విషయం తెలిసిందే. ఎంసీజీలో జరిగే టెస్ట్ భారత్ కు కీలకం కానుంది. గబ్బా టెస్ట్ లో వర్షం రావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. లేకుంటే భారత్ ఓటమి చవిచూసేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Story first published: Sunday, December 22, 2024, 11:06 [IST]
Other articles published on Dec 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+