Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లండన్ డే అవుట్: సరదా సరదాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ: సెల్ఫీలతో బిజీ

Indias cricket team captain Rohit Sharma and former captain Virat Kohli had a day out in London. Both went shopping.

లండన్: భారత క్రికెట్ సీనియర్ల జట్టు.. ఇంగ్లాండ్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లింది. యంగ్ క్రికెటర్లతో నిండిన ఒక జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో అయిదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడుతోంది. ఇవ్వాళ చివరి మ్యాచ్ జరుగనుంది. బెంగళూరు చిదంబరం స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.

సీనియర్లతో నిండిన మరో జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌ వెళ్లింది. కోవిడ్ వల్ల వాయిదా పడిన ఒక టెస్ట్‌ పాటు మొత్తం ఏడు మ్యాచ్‌లను ఆడనుంది. జులై 1వ తేదీన తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. బర్మింగ్ హామ్ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇది రీషెడ్యూల్డ్ మ్యాచ్.

గతంలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు కరోనా వైరస్ వల్ల వాయిదా పడిన టెస్ట్ మ్యాచ్ ఇది. ఇప్పుడు మళ్లీ ఈ మ్యాచ్‌ను ఆడనున్నాయి ఈ రెండుజట్లు. దీని తరువాత మూడు టీ20లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్‌లో తలపడనున్నాయి. తొలి టీ20 మ్యాచ్ వచ్చేనెల 7వ తేదీన షెడ్యూల్ అయింది. ఏజెస్ బౌల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

9, 10వ తేదీల్లో ఎడ్జ్‌బాస్టన్‌, ట్రెంట్ బ్రిడ్జ్‌ల్లో మిగిలిన రెండు టీ20 ఇంటర్నేషనల్స్ ఉంటాయి. అనంతరం రెండు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ మొదలవుతుంది. 12వ తేదీన ఓవల్ 14న లార్డ్స్‌లో ఈ రెండు మ్యాచ్‌లల్లో భారత్-ఇంగ్లాండ్ తలపడతాయి. ఈ సిరీస్‌ కోసం టీమిండియా ప్లేయర్లందరూ లండన్ విమానం ఎక్కుతున్నారు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, చేతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ.. ఇప్పటికే లండన్‌లో ల్యాండ్ అయ్యారు. కాగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. తాజాగా లండన్‌లో షాపింగ్ చేస్తూ కనిపించారు. సరదాగా గడిపారు. అభిమానులతో సెల్ఫీ దిగుతూ సందడి చేశారు.

Story first published: Sunday, June 19, 2022, 11:51 [IST]
Other articles published on Jun 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+