
న్యూజిల్యాాండ్‌తో పోల్చద్దు..
తాజాగా కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత బ్యాటర్లు చెలరేగారు. తొలి మ్యాచులో 349 పరుగులు చేసిన జట్టు.. మూడో వన్డేలో ఏకంగా 385 పరుగులు చేసింది. అసలు 400 మార్కు దాటేలా కనిపించింది కానీ.. మిడిలార్డర్ వైఫల్యంతో అంత స్కోరు చేయలేకపోయింది. అయితే పాకిస్తాన్‌తో మ్యాచుల్లో మాత్రం భారత్ అంత స్కోర్ చేయలేదని ఆకిబ్ జావెద్ అంటున్నాడు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. భారత్ చేతిలో ఓటమికి ముందు, కివీస్ జట్టు పాకిస్తాన్‌ను వాళ్ల సొంత గడ్డపై 2-1 తేడాతో వన్డేల్లో ఓడించి వచ్చింది.

పాక్ బౌలింగ్ చాలా బలం..
అయితే ఈ ఫలితం వన్డే వరల్డ్ కప్‌పై ప్రభావం చూపించదని జావెద్ అంటున్నాడు. 'న్యూజిల్యాండ్ బౌలింగ్, పాకిస్తాన్ బౌలింగ్ ఒకటి కాదు. పాక్‌పై టీమిండియా అంత స్కోర్ చేయలేదు. షహీన్ అఫ్రిదీ, హారిస్ రవూఫ్, నసీమ్ షా ముగ్గురూ ఫిట్‌గా ఉన్నారు. అయినా ఎప్పటి నుంచో భారత జట్టును మా బౌలర్లు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కాబట్టి భారత్‌లో జరిగే వరల్డ్ కప్ మాకు పెద్ద కష్టం కాదు' అని వివరించాడు. తమ బౌలింగ్ ఎటాక్ ముందు భారత బ్యాటర్లు అంత భారీ స్కోర్లు కూడా చేయలేరని అన్నాడు.

ఛేజ్ కూడా చేయలేదు..
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ప్రధాన తేడా బౌలింగ్ బలమేనని చెప్పిన జావెద్.. పాక్ వద్ద మెరుగైన బౌలింగ్ యూనిట్ ఉందన్నాడు. కాబట్టి వన్డే వరల్డ్ కప్‌లో ఈ రెండు జట్లు తలపడినా పాక్ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నాడు. 'పాక్ ముందుగా బ్యాటింగ్ చేసి 300 పరుగులు చేసినా చాలు. వాటిని ఛేజ్ చేయడం భారత్‌కు అంత ఈజీ కాదు. మా బౌలింగ్ అలాంటిది' అని చెప్పాడు. కాగా, వరల్డ్ కప్‌లలో భారత్‌పై పాకిస్తాన్ ఒకే ఒక్కసారి గెలిచింది. 2021లో యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు పది వికెట్ల తేడాతో ఓడింది. అప్పటి వరకు ఒక్కసారి కూడా భారత్‌ను వరల్డ్ కప్‌లలో పాక్ ఓడించలేదు.


Click it and Unblock the Notifications
