Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మలుపు తిరిగింది అక్కడే: సిరాజ్ ఎంపిక వెనుక ఉన్నదెవరు?

హైదరాబాద్: నవంబర్ 1 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరిస్‌కు హైదరాబాద్ కుర్రాడు మహమ్మద్ సిరాజ్ ఎంపిక క్రీడా విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే సిరాజ్ ఎంపిక వెనుక ఓ అదృశ్య శక్తి పనిచేసినట్లు తెలుస్తోంది. ఎవరా అదృశ్య శక్తి అనుకుంటున్నారా?

ఎవరో కాదు టీమిండియా బౌలింగ్ కోచ్‌గా సేవలందిస్తోన్న భరత్ అరుణ్. గత రంజీ సీజన్‌ (2016-17) మహమ్మద్ సిరాజ్‌ క్రికెట్ కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ప్రస్తుతం టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న భరత్‌ అరుణ్ గతేడాది హైదరాబాద్‌ రంజీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు.

అ సమయంలో సిరాజ్‌లోని సహజ ప్రతిభను గుర్తించి భరత్‌ అరుణ్‌ సరైన మార్గనిర్దేశనం చేశారు. నవంబర్ 1న ఢిల్లీలో జరిగే తొలి టీ20 వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాకు చివరి టీ20. దీంతో చివరి 2 మ్యాచ్‌లకు జయదేవ్‌ ఉనద్కత్‌ లేదా బాసిల్‌ థంపిలలో ఒకరికి అవకాశం లభిస్తుందని అంతా భావించారు.

 ఊహించని విధంగా సిరాజ్‌కు జట్టులో చోటు

ఊహించని విధంగా సిరాజ్‌కు జట్టులో చోటు

అయితే ఊహించని విధంగా సిరాజ్‌కు జట్టులో చోటు దక్కడం వెనుక టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ పాత్ర కూడా ఉందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. నిజానికి గతేడాది రంజీ ప్రదర్శనతో అందరి దృష్టిలో పడిన సిరాజ్‌ ఐపీఎల్‌ వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు రూ. 2 కోట్ల 60 లక్షలకు సిరాజ్‌ను తీసుకోవడం సంచలనం రేపింది. కోచ్‌ టామ్‌ మూడీ, కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ల మార్గనిర్దేశనంలో ఐపీఎల్‌లో సిరాజ్‌ జట్టుపై తనదైన ముద్ర వేశాడు.

 6 మ్యాచ్‌లలో 10 వికెట్లతో అద్భుత ప్రదర్శన

6 మ్యాచ్‌లలో 10 వికెట్లతో అద్భుత ప్రదర్శన

ఐపీఎల్ పదో సీజన్‌లో మొత్తం 6 మ్యాచ్‌లలో 10 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. గుజరాత్‌ లయన్స్‌తో 4 వికెట్లు తీసి మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ ప్రదర్శనతో ఇరానీ ట్రోఫీలో పాల్గొనే రెస్టాఫ్‌ ఇండియాకు సిరాజ్‌ ఎంపికయ్యాడు. అనంతరం ఇండియా-ఏ జట్టుకు ఎంపికైన సిరాజ్‌ను రాహుల్ ద్రవిడ్ మరింతగా ప్రోత్సహించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరిగిన ఏకైక అనధికార టెస్టులో సిరాజ్ 5 వికెట్లు తీశాడు.

14 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లాడిన 53 వికెట్లు తీసిన సిరాజ్

14 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లాడిన 53 వికెట్లు తీసిన సిరాజ్

ఆ తర్వాత వరుసగా అఫ్గానిస్థాన్‌-ఏ, న్యూజిలాండ్‌-ఏ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో ఇండియా-ఏ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. ఇప్పటివరకు మొత్తం 14 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లాడిన సిరాజ్ 22.30 సగటుతో 53 వికెట్లు తీశాడు. ఇక భారత్ ఏ తరుపున 16 టి20ల్లో 26 వికెట్లు తీసి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు.

 గత రంజీ సీజన్‌లో 41 వికెట్లు తీసిన సిరాజ్

గత రంజీ సీజన్‌లో 41 వికెట్లు తీసిన సిరాజ్

గతేడాది జరిగిన రంజీ ట్రోఫీలో సిరాజ్‌, రవికిరణ్‌, సీవీ మిలింద్‌లతో భరత్‌ అరుణ్ సంచలన విజయాలను నమోదు చేశాడు. గ్రూప్‌-సిలో ఉన్న హైదరాబాద్‌ను ఏకంగా క్వార్టర్‌ఫైనల్‌ వరకు తీసుకెళ్ళాడు. గత రంజీ సీజన్‌లో ముగ్గురు పేసర్లు కలిసి 110 వికెట్లు తీయగా... అందులో సిరాజ్‌ 18.92 సగటుతో 41 వికెట్లు తీశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+