Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌతాఫ్రికా ఓటమితో భారత్ సెమీస్ బెర్తు ఖరారు.. రెండో జట్టు తేలేది నేడే!

Team India becomes first team to reach Semifinals from Group-2

గతేడాది టీ20 ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఓటమి చవిచూసిన భారత జట్టు గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి అలాంటి పరిస్థితిలో లేదు. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌కు తోడు కీలకమైన మ్యాచుల్లో మరొక ఆటగాడు కూడా రాణిస్తూ జట్టుకు అవసరమైన విజయాలు అందిస్తున్నారు. దీంతో గ్రూప్-2 నుంచి సెమీస్ చేరిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.

టోర్నీ ప్రారంభించిందిలా..

టోర్నీ ప్రారంభించిందిలా..

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా .. రెండో మ్యాచులో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ రాణించడంతో రెండు కీలక విజయాలు నమోదు చేసింది. ఆ తర్వాత సౌతాఫ్రికా చేతిలో ఓడినప్పటికీ.. బంగ్లాదేశ్‌పై మరోసారి కోహ్లీ, రాహుల్ రాణించడంతో విజయం నమోదు చేసింది. దీంతో మూడు మ్యాచుల్లో గెలిచి ఆరు పాయింట్లతో నిలిచిన భారత్.. గ్రూప్-2 నుంచి సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.

 సౌతాఫ్రికా షాకర్..

సౌతాఫ్రికా షాకర్..

సౌతాఫ్రికాపై పసికూన నెదర్లాండ్స్ సంచలనం నమోదు చేయడంతో ఈ గ్రూప్‌లో సమీకరణాలు మారిపోయాయి. సౌతాఫ్రికా, భారత్ సెమీస్ చేరతాయని, మిగతా జట్లకు ఛాన్స్ ఉన్నా అవి సెమీస్ చేరడం దాదాపు అసాధ్యమేనని అంతా అనుకున్నారు. కానీ సౌతాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించడంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లకు తలుపులు తెరుచుకున్నాయి. ఈ రెండు జట్లు కూడా ఆదివారం తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమస్‌లో చివరి బెర్తు దక్కించుకుంటుంది.

 సెమీస్ చేరే రెండో జట్టు..

సెమీస్ చేరే రెండో జట్టు..

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండు జట్లూ చెరో 4 పాయింట్లతో ఉన్నాయి. ఆదివారం నాడు జరుగుతున్న మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు మరో రెండు పాయింట్లు దక్కుతాయి. దాంతో 6 పాయింట్లతో ఆ జట్టు సెమీస్ చేరుకుంటుంది. ఇదే గ్రూప్‌లో 5 పాయింట్లతో ఉన్న సౌతాఫ్రికా జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇప్పటికే ఆరు పాయింట్లతో ఉన్న భారత జట్టు సెమీస్ చేరినట్లే. జింబాబ్వేపై కూడా భారత్ గెలిస్తే గ్రూప్-2 టాపర్‌గా నిలుస్తుంది టీమిండియా. అంటే సెమీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది.

Story first published: Sunday, November 6, 2022, 10:15 [IST]
Other articles published on Nov 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+