
విరాట్ కోహ్లీ ఫేలవ ఫామ్‌పై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందించాడు. కోహ్లీ బ్యాటింగ్‌పై ఎలాంటి ఆందలోన అవసరం లేదని, అతను త్వరలోనే చెలరేగుతాడని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో కోహ్లీ విఫలమైన మాట వాస్తవమేనని, కానీ అతను ఫామ్‌లో లేడనే వ్యాఖ్యలను తాను సమర్థించనని ఆయన చెప్పుకోచ్చాడు. నెట్స్‌లో కోహ్లీ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని తెలిపాడు. మ్యాచ్‌కు ముందు బాగానే సన్నధమవుతున్నాడని, త్వరలోనే ఓ గొప్ప ఇన్నింగ్స్ ఆడి తానెంటో నిరూపించుకుంటాడని రాథోడ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయక రెండేళ్లయింది.
అలాగే వికెట్ కీపర్ రిషబ్ పంత్ లోయర్ ఆర్డర్‌లో బాగా పరుగులు చేయగలడని, అయితే అతడిని ఓపెనర్‌గా మార్చే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చాడు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చి కూడా పంత్ పరుగులు చేయగలడని అన్నాడు. ప్రస్తుతానికి పంత్‌ను మిడిలార్డర్‌లోనే ఆడించనున్నట్లు చెప్పాడు. పంత్ భవిష్యత్‌లో ఓపెనర్‌గా రావడమనేది అప్పటి జట్టు పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపాడు. అలాగే లోయర్ ఆర్డర్‌లో పంత్ మినహా మరో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ లేడని విక్రమ్ రాథోడ్ అన్నాడు. కాగా వెస్టిండీస్‌తో రెండో వన్డే మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధంగా రిషబ్ పంత్ ఓపెనర్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ మ్యాచ్‌లో పంత్ రాణించలేకపోయాడు. 18 పరుగులు మాత్రమే చేశాడు.

కాగా వెస్టిండీస్‌తో 16, 18, 20వ తేదీల్లో టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు ఎంపికైన కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ గాయపడడంతో వారి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు.
భారత టీ20 జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అవేష్ ఖాన్, యజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, జయంత్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్.