Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

న్యూ ఇయర్ స్పెషల్: ఆస్ట్రేలియా ప్రధాని నివాసంలో కోహ్లీసేన (ఫోటోలు)

Team India and Australia at the Australian Prime Ministers residence

హైదరాబాద్: న్యూ ఇయర్ సందర్భంగా టీమిండియాకు అరుదైన ఆహ్వానం అందించింది. సుదీర్ఘ పర్యటనలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న సంగతి తెలసిందే. కొత్త ఏడాదిని పురస్కరించుకుని ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా జట్టుని ఆ దేశ ప్రధాని ప్రత్యేక విందుకు ఆహ్వానించారు.

ఆస్ట్రేలియా ప్రధాని నివాసంలో టీమిండియా

ఆస్ట్రేలియా ప్రధాని నివాసంలో టీమిండియా

విందు అనంతరం ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మొరిసన్ ఇరు జట్లతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. 'ఆస్ట్రేలియా ప్రధాని నివాసంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు ఫోటోలకు ఫోజు ఇస్తోన్న దృశ్యం' అంటూ కామెంట్ కూడా పెట్టింది.

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 2-1 ఆధిక్యం

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 2-1 ఆధిక్యం

కాగా, గత ఆదివారం మెల్ బోర్న్ వేదికగా ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా 137 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భారత జట్టు 2-1 ఆధిక్యంలో నిలిచింది. టెస్టుల్లో టీమిండియా ఇది 150వ విజయం కావడం విశేషం.

జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు

జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు

ఈ సిరిస్‌లో చివరిదైన నాలుగు టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ సిరిస్ అనంతరం ఇరు జట్ల మధ్య జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ మూడు వన్డేల సిరిస్‌కు ఆసీస్ పేస్ బౌలర్లు పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్, జోస్‌ హేజెల్‌వుడ్‌ దూరమయ్యారు.

Story first published: Tuesday, January 1, 2019, 12:22 [IST]
Other articles published on Jan 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+