
కసరత్తులు చేసిన టీమిండియా
ఇక బౌలర్లు భువనేశ్వర్, ఇషాంత్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ఈ ప్రాక్టీస్‌ను పర్యవేక్షించారు. బ్యాటింగ్ తర్వాత ఆటగాళ్లందరూ మైదానంలో కాసేపు కసరత్తులు చేశారు. అయితే బంగ్లాతో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో క్రికెట్ పట్ల కోహ్లీ అంకితభావం మరోసారి రుజువైంది.

కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు
53 టెస్టులు, 179 వన్డేల్లో కలిపి దాదాపుగా 12000 పరుగులు సాధించిన కోహ్లీ బంగ్లాదేశ్‌తో జరగనున్న ఏకైక టెస్టులో కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అద్భుతమైన ఫామ్‌లో కోహ్లీ సేన ఇంగ్లాండ్‌పైనే విజయం సాధించి నేపథ్యంలో బంగ్లాదేశ్ విజయం సాధించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మధ్యాహ్నం 3 గంటలకు ఉప్పల్ కోహ్లీ
మొన్నటి వరకు ఇంగ్లాండ్‌తో టెస్టులు, వన్డేలు, టీ20 సిరీస్‌లతో బిజీగా గడిపిన కోహ్లీ, బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. సోమవారం ఉదయం 9.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న కోహ్లీ, మధ్యాహ్నం 3 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ప్రత్యక్షమయ్యాడు.

2 గంటల పాటు నెట్స్‌లో చెమటోడ్చిన కోహ్లీ
స్టేడియానికి రాగానే పిచ్ వద్ద బీసీసీఐ సౌత్‌జోన్ క్యురేటర్ విశ్వనాథన్, హెచ్‌సీఏ క్యురేటర్ చంద్రశేఖర్‌లను కలిసిన కోహ్లీ పిచ్‌పై రేపు మాట్లాడదాం అంటూ నెట్స్‌కు వెళ్ళాడు. సుమారు 2 గంటల పాటు నెట్స్‌లో చెమటోడ్చాడు. ఇషాంత్‌శర్మ, భువనేశ్వర్‌కుమార్, రవీంద్ర జడేజాతో పాటు నెట్స్‌లో కుర్రాళ్ళతో బౌలింగ్ చేయించుకున్నాడు.

రాగానే ప్రాక్టీస్ మొదలు పెట్టిన కోహ్లీ
కోహ్లీ, విజయ్ భారీ షాట్లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ కోహ్లీకి బంతులు విసిరాడు. కోచ్ అనిల్ కుంబ్లే ఈ సెషన్‌ను పర్యవేక్షించాడు. కీపర్ సాహా ప్రధాన మైదానంలో ప్రాక్టీస్ చేశాడు.


Click it and Unblock the Notifications











