దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో టీమిండియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 115 పాయింట్లతో భారత్ నెంబర్ వన్ స్ధానంలో నిలవగా, 111 పాయింట్లతో పాకిస్థాన్ రెండో స్ధానంలో నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి108 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్ధానంలో నిలవగా, ఆ తర్వాతి స్ధానాల్లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి. ఇక బౌలర్ల జాబితాలో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన నెంబర్ వన్ ర్యాంకుని కాపాడుకున్నాడు.

ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన సిరిస్‌లో రాణించి, 200 వికెట్ల క్లబ్‌లో చేరిన అశ్విన్ 900 పాయింట్లతో టెస్టు బౌలర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 878 పాయింట్లతో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్, 861 పాయింట్లతో ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
ఇక ఆల్ రౌండర్ల జాబితాలోనూ అశ్విన్ టాప్‌లో ఉండగా, రెండో స్థానంలో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబుల్ హసన్ ఉండగా, మూడో స్థానంలో జడేజా కొనసాగుతున్నాడు.
బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మొదటి స్థానంలోనూ, పాక్ సీనియర్ ప్లేయర్ యూనిస్ ఖాన్ రెండో స్థానంలో, ఇంగ్లాండ్ ఆటగాడు రూట్ మూడో స్థానంలో ఉన్నారు.
825 పాయింట్లతో భారత ఆటగాడు రహానే ఆరో స్ధానంలో నిలిచాడు. ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ వరుసగా 15, 17 స్థానాల్లో ఉన్నారు.