న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక ఇంటి వాడైన అక్షర్ పటేల్.. నెట్టింట పెళ్లి ఫొటోలు వైరల్

 Team India all rounder Axar Patel gets married

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఒక ఇంటి వాడయ్యాడు. ఏడాది క్రితం నిశ్చితార్థం చేసుకున్న మేహా పటేల్‌ను వివాహం చేసుకున్నాడు. రెండ్రోజుల క్రితమే స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా తన ప్రేయసి అతియా శెట్టిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రాహుల్, అక్షర్ ఇద్దరూ న్యూజిల్యాండ్ సిరీస్ ఆడలేదు. ఈ సమయంలో వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరంగా ఉంటామని బీసీసీఐకి తెలియజేశారు.

గతేడాది తన 28వ జన్మదినం సందర్భంగా అక్షర్ పటేల్, మేహా నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఈ జంట.. బుధవారం నాడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను అక్షర్ ఎక్కడా పంచుకోలేదు. కానీ ఈ వేడుకకు సంబంధించిన చాలా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దేశవాళీల్లో సౌరాష్ట్ర సారధి జయదేవ్ ఉనద్కత్ ఈ వివాహానికి హాజరయ్యాడు. కొత్త దంపతులతో కలిసి ఫొటో దిగిన అతను దాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

'కొత్త జంటకు శుభాకాంక్షలు. వెల్‌కమ్ టు ది క్లబ్' అని క్యాప్షన్ ఇచ్చాడు. అక్షర్ భార్య మేహా న్యూట్రీషియన్, డైటీషియన్. ఆమె తన సొంత బిజినెస్ చేయడంతోపాటు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ కూడా ఇస్తుందని సమాచారం. వీళ్లిద్దరూ పెళ్లికి ముందు సంగీత్‌లో సంతోషంగా ఆడిపాడారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అయింది. వీళ్ల వెనుక చాలా మంది గ్రూప్ డ్యాన్సర్లు హార్ట్ షేప్స్ పట్టుకొని కనిపించారు. ఈ వీడియో నెట్టింట చాలా వైరల్ అయింది.

దీంతో వీళ్లకు బీసీసీఐ సెలవు ఇచ్చింది. ఈ సమయంలోనే వీళ్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. సౌరాష్ట్ర ప్లేయర్ అయిన అక్షర్ ఇటీవలి కాలంలో అద్భుతంగా ఆడుతూ.. రవీంద్ర జడేజాకు సరైన బ్యాకప్‌గా మారిన సంగతి తెలిసిందే. బ్యాటర్‌గా కూడా తన ఆటతీరును అక్షర్ మెరుగు పరుచుకున్నాడు. దీంతో టీమిండియాకు అతను చాలా కీలకమైన ఆటగాడని నిపుణులు అంటున్నారు.

Story first published: Friday, January 27, 2023, 15:06 [IST]
Other articles published on Jan 27, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X