Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : ఆస్ట్రేలియా కూడా తిప్పేసింది.. ఒక్క రోజులోనే టెస్టు మ్యాచ్ ముగుస్తుందా?

Team India all out as Aussie spinners rule in third test

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లు అదరగొట్టారు. ఆరంభం నుంచే పిచ్ నుంచి బౌలర్లకు మంచి సహకారం అందింది. దీన్ని చక్కగా ఉపయోగించుకున్న ఆసీస్ బౌలర్లు.. భారత బ్యాటర్లను బెంబేలెత్తించారు. ఈ సిరీస్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ (12) తొలి బంతికే అవుటయ్యాడు. కానీ అంపైర్ తప్పుడు నిర్ణయంతో బతికిపోయాడు. అదే ఓవర్ నాలుగో బంతికి కూడా ఒక్క పరుగు కూడా చెయ్యకముందే రోహిత్ అవుటవ్వాల్సింది. మళ్లీ అంపైర్ వల్ల బతికిపోయాడు.

టాపార్డర్ టపటపా..

టాపార్డర్ టపటపా..

ఇలా రెండు సార్లు దక్కిన జీవనదానాన్ని రోహిత్ యూజ్ చేసుకోలేకపోయాడు. స్పిన్నర్లు రంగంలోకి దిగగానే పెవిలియన్ బాటపట్టాడు. కునేమన్ వేసిన బంతిని ముందుకొచ్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి మిస్సయ్యాడు. ఈ బంతిని అందుకున్న కీపర్ క్యారీ వికెట్లను కూల్చడంతో రోహిత్ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (21) కూడా కునేమన్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ఆడేందుకు అతను ప్రయత్నించగా ఎడ్జ్ తీసుకున్న బంతిని స్లిప్స్‌లో ఉన్న స్మిత్ చక్కగా అందుకున్నాడు. పుజారా (1) కూడా లియాన్ వేసిన బంతి అనూహ్యంగా టర్న్ అవడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

మిడిలార్డర్‌లో కోహ్లీ ఒక్కడే..

టీమిండియా టాపార్డర్ విఫలం అవడంతో భారం అంతా మిడిలార్డర్‌పై పడింది. ఈ క్రమంలో లెఫ్ట్, రైట్ కాంబినేషన్ కోసం రవీంద్ర జడేజా (4)ను ముందుగా పంపించారు. అతను కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఎల్బీ ప్రమాదం తప్పించుకున్న మరుసటి బంతికే క్యాచ్ అవుటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ (0) తను ఎదుర్కొన్న రెండో బంతిని వికెట్ల మీదకు ఆడుకొని పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ (22), కేఎస్ భరత్ (17) ఇద్దరూ కాసేపు జట్టును ఆదుకున్నారు. కానీ మర్ఫీ బౌలింగ్‌లో బంతి టర్న్ అవుతుందని అనుకున్న కోహ్లీ.. అది స్ట్రెయిట్‌గా రావడంతో ఎల్బీడబ్ల్యూగా మైదానం వీడాడు. కాసేపటికే లియాన్ బౌలింగ్‌లో భరత్ కూడా ఎల్బీగా పెవిలియన్ చేరాడు.

లోయర్ ఆర్డర్ కూడా..

లోయర్ ఆర్డర్ కూడా..

ఇక చివర్లో భారమంతా అశ్విన్ (3), అక్షర్ పటేల్ (12 నాటౌట్)పై పడింది. కానీ కునేమన్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడబోయిన అశ్విన్ కూడా కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఉమేష్ యాదవ్ (17) రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఆ వెంటనే కునేమన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‌లో కునేమన్ ఐదు వికెట్లు హాల్ పూర్తయింది. చివర్లో అనవసర పరుగు కోసం అక్షర్ ప్రయత్నించాడు. అప్పటికే రెండో పరుగు నిరాకరించిన సిరాజ్ (0).. అక్షర్ క్రీజు వదిలి వచ్చేయడంతో తను కూడా డేంజర్ ఎండ్ వైపు పరుగు తీశాడు. ఈ క్రమంలో రనౌట్ అయ్యాడు. దీంతో భారత జట్టు కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో కునేమన్ ఐదు, లియాన్ మూడు, మర్ఫీ ఒక వికెట్ తీసుకున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ టెస్టు మ్యాచ్ ఒక్క రోజులోనే ముగుస్తుందా? ఏంటి? అని జోకులు పేలుస్తున్నారు.

Story first published: Wednesday, March 1, 2023, 13:06 [IST]
Other articles published on Mar 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+