For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Team Comparison 2015 vs 2019: నాలుగేళ్లలో కొత్తగా 8 మందికి!

Team Comparison 2015 vs 2019: India squad for icc world cup at England

హైదరాబాద్: భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న వన్డే వరల్డ్‌కప్ కోసం భారత జట్టుని సోమవారం సెలక్టర్లు ప్రకటించారు. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరును ప్రకటించారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

2015 వరల్డ్‌కప్‌తో పోల్చితే 8 మంది కొత్తవారికి ఈ వరల్డ్ కప్‌లో చోటు దక్కింది. అనుభవం, ఆటతీరుని పరిగణనలోకి తీసుకున్న సెలక్టర్లు జట్టుని ఎంపిక చేశారు. కోహ్లీతో పాటు రోహిత్ శ‌ర్మ‌, శిఖ‌ర్ ధావ‌న్‌, కేఎల్ రాహుల్‌, విజ‌య్ శంక‌ర్‌, ధోనీ, కేదార్ జాద‌వ్‌, దినేశ్ కార్తీక్‌, చాహ‌ల్‌, కుల్దీప్ యాద‌వ్‌, భువ‌నేశ్వ‌ర్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, జ‌డేజా, షమీలు ఉన్నారు.

కాగా, అంబటి రాయుడు, రిషబ్‌ పంత్‌లకు సెలక్టర్లు మొండిచేయి చూపించారు. 2015లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో ఆడిన ఏడుగురికి సెలక్టర్లు చోటు కల్పించారు. ఇషాంత్‌ శర్మ మోచేతి గాయం కారణంగా 2015 వరల్డ్ కప్‌కు దూరమైతే అతని స్థానంలో మోహిత్‌ శర్మను ఎంపిక చేశారు.

కాగా, కొత్తగా భారత వరల్డ్‌కప్‌ జట్టలో చోటు దక్కించుకున్న వారిలో విజయ్‌ శంకర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, కేదార్‌ జాదవ్‌, కుల్దీప్‌ యాదవ్‌, దినేశ్‌ కార్తీక్‌, చాహల్‌, బుమ్రాలు ఉన్నారు.

2015 వరల్డ్‌కప్‌లో ఆడిన భారత జట్టు:
విరాట్‌ కోహ్లీ(కెప్టెన్), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), మహేంద్ర సింగ్‌ ధోని, స్టువర్ట్‌ బిన్ని, అక్షర్‌ పటేల్‌, సురేశ్‌ రైనా, మోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, భువేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ.

2019 వరల్డ్‌కప్‌లో ఆడబోయే భారత జట్టిదే:
విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, విజయ్‌ శంకర్‌, మహేంద్ర సింగ్ ధోనీ, కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తిక్‌, యుజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ.

Story first published: Monday, April 15, 2019, 18:59 [IST]
Other articles published on Apr 15, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+