కోహ్లీ 500: అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత కెప్టెన్లు వీరే
హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో రికార్డుల మోత మోగుతుంది. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక టెస్టు సిరిస్‌లో 500కు పైగా పరుగులు సాధించిన రెండో భారత కెప్టెన్‌గా కోహ్లీ గుర్తింపు పొందాడు.
నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 6వ పరుగు సాధించే క్రమంలో ఈ సిరీస్‌లో కోహ్లీ 500 పరుగుల మార్కును చేరాడు. దీంతో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ రికార్డుని కోహ్లీ సమం చేశాడు. ఒక సిరిస్‌లో 500కు పైగా పరుగులను గవాస్కర్ రెండు సార్లు సాధించాడు.

రెండు సార్లు 500 పరుగులు చేసిన గవాస్కర్
1978-79 సీజన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో గవాస్కర్ ఐదు వందలకు పైగా పరుగులు చేశాడు. ఆ తర్వాత 1981-82 సీజన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో గవాస్కర్ ఐదు వందల పరుగుల మార్కును రెండోసారి సాధించి చరిత్ర సృష్టించాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరిస్‌లో కోహ్లీ ఈ ఫీట్‌ని సాధించాడు.

కోహ్లీ యావరేజి 120
ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ ఫీట్‌ను సాధించే క్రమంలో కోహ్లీ యావరేజి 120కి పైగా ఉండటమే. నాలుగో టెస్టులో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. కోహ్లీకి ఇది టెస్టుల్లో 15వ సెంచరీ కాగా, ఈ సిరీస్‌లో రెండోది. 187 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 11 ఫోర్ల సాయంతో సెంచరీని పూర్తి చేశాడు.

టెస్టుల్లో 15వది కాగా, కెప్టెన్‌గా 8వది
ఇదిలా ఉండే నాలుగో టెస్టులో కోహ్లీ చేసిన సెంచరీ టెస్టుల్లో 15వది కాగా, కెప్టెన్‌గా 8వది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు నమోదు చేసిన భారత కెప్టెన్లను పరిశీలిస్తే అందులో సునీల్ గవాస్కర్ 11 సెంచరీలతో మొదటిస్ధానంలో ఉన్నాడు.

కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన భారత కెప్టెన్లు వీరే
సునీల్ గవాస్కర్ - 11
మహ్మద్ అజారుద్దీన్ - 9
విరాట్ కోహ్లీ - 8
సచిన్ టెండూల్కర్ - 7
పటౌడీ,గంగూలి,ధోనీ - 5
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications