Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2023 : మహిళల ప్రీమియర్ లీగ్ హక్కులు కూడా టాటాకే..!

TATA Group acquires WPL Title sponsership rights

వచ్చే నెలలో జరిగే మొట్టమొదటి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ హక్కులను టాటా గ్రూప్ దక్కించుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ హక్కులు కూడా టాటా గ్రూప్ దగ్గరే ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే డబ్ల్యూపీఎల్ హక్కులకు సంబంధించి బీసీసీఐ, టాటా సన్స్ మధ్య భారీ డీల్ జరిగింది. మొత్తం ఐదేళ్ల పాటు టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు టాటాకు దక్కాయి. ఈ డీల్ విలువ ఎంత అనేది ఇంకా బయటకు రాలేదు.

కొన్ని రోజుల కోసం మీడియా హక్కులు అమ్మేందుకు టెండర్లు పిలిచింది. ఈ హక్కులను వయాకామ్ సంస్థ ఐదేళ్ల కాలానికి రూ.951 కోట్లకు దక్కించుకుంది. ఇంతకుముందు జట్టు ఫ్రాంచైజీలను కొనుగోలు చేయడానికి కూడా ప్రముఖ సంస్థలకు బీసీసీఐ ఆహ్వానాలు పంపింది. ఈ ఫ్రాంచైజీల అమ్మకం ద్వారా బీసీసీఐ సుమారు రూ.4,670 కోట్లు సంపాదించినట్లు సమాచారం. ఐపీఎల్‌లో ఉన్న మూడు ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్.. డబ్ల్యూపీఎల్‌లో కూడా జట్లను కొన్నాయి.

వీటితోపాటు అదానీ గ్రూప్, కాప్రి గ్లోబల్ కూడా రెండు ఫ్రాంచైజీ హక్కులను కొనుగోలు చేశాయి. ఈ ఫ్రాంచైజీల్లో అహ్మదాబాద్‌కు కేంద్రంగా ఉన్న గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీ అత్యధికంగా రూ.1289 కోట్లకు అమ్ముడుపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై ఇండియన్స్ (రూ.912.99 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ.901 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (రూ.810 కోట్లు), యూపీ వారియర్జ్ (రూ.757 కోట్లు) ఉన్నాయి. ప్రస్తుతం సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ముగిసిన ఐదు రోజుల్లోనే డబ్ల్యూపీఎల్ ప్రారంభం అవుతుంది. దీంతో ఈ టోర్నీని కేవలం రెండు స్టేడియాల్లోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ టోర్నీలో మొత్తం 22 మ్యాచులు జరుగుతాయని ప్రకటించింది.

Story first published: Tuesday, February 21, 2023, 22:33 [IST]
Other articles published on Feb 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+