Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హైదరాబాద్ కెప్టెన్‌గా తన్మయ్.. రాయుడికి దక్కని చోటు!!

Tanmay Agarwal named Hyderabad captain in Ranji Trophy


హైదరాబాద్:
ప్రతిష్టాత్మక అఖిల భారత రంజీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్‌ జట్టును హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రకటించింది. బుధవారం 15 మందితో కూడిన జట్టును హెచ్‌సీఏ ప్రకటించింది. ఇటీవల హెచ్‌సీఏపై అవినీతి ఆరోపణలు చేసిన భారత సీనియర్ క్రికెటర్ అంబటి రాయుడు ఈ సీజన్‌ రంజీ ట్రోఫీ నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో జట్టు సారథ్యాన్ని తన్మయ్‌ అగర్వాల్‌కు అప్పగించారు.

మరోవైపు బావనక సందీప్‌కు వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ జట్టుకు ఎన్‌. అర్జున్‌ యాదవ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నారు. హెచ్‌సీఏపై అవినీతి ఆరోపణలు చేసిన రాయుడుకు జట్టులో చోటు దక్కలేదు. రంజీ ట్రోఫీలో భాగంగా ఈ నెల 9 నుంచి 12 వరకు సొంతగడ్డపై జరిగే తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో హైదరాబాద్‌ జట్టు ఆడుతుంది.

ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ధ్రువ్ షోరే నాయకత్వం వహించనున్నాడు. డిప్యూటీ కెప్టెన్‌గా నితీష్ రాణా వ్యవహరించనున్నాడు. ఇటీవలే ముగిసిన విజయ్ హజారే, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ధ్రువ్ ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. మొదటి రెండు మ్యాచ్‌లకు జట్టుని బుధవారం ఢిల్లీ & డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ప్రకటించింది. ఈ రంజీ సీజన్‌లో భాగంగా ఢిల్లీ జట్టు తన తొలి మ్యాచ్‌ని కేరళతో తలపడనుంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇశాంత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్‌లను మొదటి రెండు మ్యాచ్‌లకు జట్టులోకి తీసుకోలేదు.

తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సందీప్ (వైస్ కెప్టెన్), అక్షత్ రెడ్డి, రోహిత్ రాయుడు, హిమలయ్ అగర్వాల్, సుమంత్, హసన్, సాయిరామ్, రవి కిరణ్, సిరాజ్, మిలింద్, త్యాగరాజన్, శశిధర్ రెడ్డి, యుధ్‌వీర్, మల్లికార్జున్.

Story first published: Thursday, December 5, 2019, 16:56 [IST]
Other articles published on Dec 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+