రోహిత్ క్యాచ్ డ్రాప్: ఈ సారీ సెంచరేనా? రెండు సెంచరీలు, ఓ అర్ధసెంచరీ లైఫ్ ద్వారా వచ్చినవే!

బర్మింగ్‌హామ్: భారత క్రికెట్ జట్టు డాషింగ్ ఓపెనర్, వైస్ కేప్టెన్ రోహిత్ శర్మ మరో సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో మంగళవారం ఆరంభమైన మ్యాచ్‌లో రోహిత్ శర్మ.. హిట్‌మ్యాన్ అనే ముద్దుపేరును నిలబెట్టుకున్నాడు. 45 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. సెంచరీపై కన్నేశాడు. ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఇప్పటిదాకా రోహిత్ శర్మ మూడు సెంచరీలను బాదేశాడు. ఇక నాలుగో సెంచరీ సాధించేలా కనిపిస్తున్నాడు. జోరుగా ఆడేస్తున్నాడు. బంగ్లాదేశ్ బౌలింగ్‌ను లెక్క చేయట్లేదు. దుమ్ము రేపుతున్నాడు. తనదైన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరిస్తున్నాడు.
లైఫ్ దొరికిన ప్రతీసారి సెంచరీ..
ఇక్కడో విచిత్రమేమిటంటే- రోహిత్ శర్మ సాధించిన మూడు సెంచరీల్లో రెండు.. క్యాచ్‌లను డ్రాప్ చేసిన తరువాత నమోదు చేసినవే. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా కూడా రోహిత్ శర్మకు ఓ లైఫ్ దొరికింది. ఇన్నింగ్ నాలుగో ఓవర్‌లో ముస్తాఫిజుర్ వేసిన బంతిని భారీ షాట్ ఆడాడు రోహిత్. అది కాస్తా గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ వద్ద కాపుగాసిన తమీమ్ ఇక్బాల్ దాన్ని అందుకోలేకపోయాడు. అదేమీ కష్టమైన క్యాచ్ కాదు. అయినప్పటికీ.. తడబడ్డాడు. తొట్రుపాటు పడ్డాడు. ఆ క్యాచ్ పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో.

లడ్డూలాంటి క్యాచ్.. నేలపాలు
ఫలితంగా- రోహిత్ శర్మ ఇచ్చిన లడ్డూలాంటి క్యాచ్ నేలపాలైంది. అప్పటికి రోహిత్ శర్మ వ్యక్తిగత స్కోరు 9 పరుగులే. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదతను. కళాత్మక షాట్లతో బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుని పడ్డాడు. 45 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం రోహిత్ శర్మ సెంచరీ దిశగా సాగుతున్నాడు. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో నాలుగో సెంచరీ సాధిస్తే అదో రికార్డయి కూర్చుంటుంది. తాజాగా- బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద తమీమ్ ఇక్బాల్ క్యాచ్‌ను వదిలేశాడు. దీనితో- ఇక రోహిత్ శర్మ మరో సెంచరీ సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

క్యాచ్ డ్రాప్..రెండు సెంచరీలు..ఓ హఫ్ సెంచరీ..ఇక ఈ సారి?
ఇప్పటిదాకా దక్షిణాఫ్రికా మీద 122, ఆస్ట్రేలియా మీద 57, ఇంగ్లండ్‌పై 102 పరుగులను చేశాడు. ఈ మూడు మ్యాచుల్లోనూ రోహిత్ శర్మ సింగిల్ డిజిట్‌కే అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన వ్యక్తిగత స్కోరు ఒక పరుగు వద్ద అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 144 బంతుల్లో 122 పరుగుల చేసి, నాటౌట్‌గా నిలిచాడు. అలాగే ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో తన వ్యక్తిగత స్కోరు రెండు పరుగుల వద్ద అవుట్ కాబోయి, అదృష్టవశావత్తూ తప్పించుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 57 రన్స్ చేశాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో నాలుగు పరుగుల వద్ద అవుట్ కాబోయాడు. మళ్లీ అదృష్టం వెంట ఉండటంతో బయటపడ్డాడు. ఆ మ్యాచ్‌లో 102 పరుగులు సాధించాడు.
{headtohead_cricket_3_10}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications