Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘800’: స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీ ధరన్ పాత్రలో తమిళ నటుడు!

Tamil actor Vijay Sethupathi to play Muttiah Muralitharan in film ‘800’

హైదరాబాద్: శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తోన్న సినిమా '800'. టెస్టుల్లో ముత్తయ్య మురళీ ధరన్ తీసిన వికెట్ల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ముత్తయ్య మురళీధరన్ పాత్రను తమిళ నటుడు విజయ్ సేతుపతి పోషించనున్నట్లు ఓ ప్రముఖ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది.

మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్

మొత్తం 133 టెస్టులాడి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ముత్తయ్య మురళీధరన్(800) అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. 350 వన్డేల్లో 534 వికెట్లు, 12 టీ20ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా చూస్తే మూడు ఫార్మాట్లు చూస్తే ముత్తయ్య మురళీ ధరన్ 1,247 వికెట్లు పడగొట్టాడు.

1972లో కాండీలో జన్మించిన ముత్తయ్య

1972లో కాండీలో జన్మించిన ముత్తయ్య

1972లో కాండీలో జన్మించిన ముత్తయ్య మురళీ ధరన్ 1992 నుంచి 2011 మధ్య కాలంలో శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. తన బౌలింగ్ యాక్షన్‌తో క్రికెట్‌లో ఎన్నో అద్భుతమైన రికార్డులను తన పేరిట లిఖించాడు. 1996లో శ్రీలంక జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంలో ముత్తయ్యదే కీలకపాత్ర.

డిసెంబర్, 2019 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం

డిసెంబర్, 2019 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం

"డిసెంబర్, 2019 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదొక పెద్ద బడ్జెట్ సినిమా, ఈ సినిమా మొత్తాన్ని భారత్‌లోనే చిత్రీకరించారు. శ్రీలంక, ఇంగ్లాండ్‌లలో సైతం కొంత సినిమాను తీస్తాం" అని సినిమాను రూపొందించే వారు ఇండియా టుడేతో చెప్పినట్లు సమాచారం. అయితే, ఈ సినిమాపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

తెలుగులో సైరాలో నటించిన విజయ్ సేతుపతి

తెలుగులో సైరాలో నటించిన విజయ్ సేతుపతి

విజయ్ సేతపతి ప్రస్తుతం 'సంగ తమిజాన్', 'కడైసయి వివసాయి' అనే తమిళ సినిమాతో పాటు తెలుగులో సైరా సినిమాలో నటిస్తున్నాడు. జూన్‌లో విడుదలైన తమిళ సినిమా 'సింధుబాద్' బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. ఇటీవలే 'మార్కోనీ మథాయి' అనే సినిమాతో మళయాళంలో అరంగేట్రం చేశాడు.

అభిమానులను అలరించిన క్రికెటర్ల బయో‌పిక్‌లు

అభిమానులను అలరించిన క్రికెటర్ల బయో‌పిక్‌లు

కాగా, ఈ మధ్య కాలంలో విడుదలైన క్రికెటర్ల బయోపిక్‌లు అభిమానుల మనసు చూరగొన్నాయి. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, మహ్మద్ అజారుద్దీన్, మేరీ కోమ్, మిల్కా సింగ్, బాల్ థాకరీ వంటి వారిపై వచ్చిన సినిమాలు అభిమానులను అలరించాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ లెజెండ్‌గా పేరుగాంచిన ముత్తయ్యపై సినిమా ప్లాన్ చేశారు.

Story first published: Monday, July 22, 2019, 13:36 [IST]
Other articles published on Jul 22, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+