బాలీవుడ్, క్రికెట్ ప్రపంచాలకు ఉన్న అనుబంధం ఎప్పటి నుంచో ఉంది. ఈ రెండు రంగాల్లోని సెలబ్రిటీల మధ్య ప్రేమ, పెళ్లిళ్లు సాధారణమే. చాలా మంది క్రికెటర్లు బాలీవుడ్ నటీమణులను పెళ్లి చేసుకున్నారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కూడా ఇలాగే ప్రేమించుకున్నారు. అనంతరం పెళ్లి చేసుకున్నారు. వీరు ఓ ప్రకటన షూటింగ్‌లో కలుసుకున్న తర్వాతే వారి మధ్య ప్రేమ చిగురించింది. అలాగే మహేంద్ర సింగ్ ధోని కూడా నటి లక్ష్మీరాయ్, దీపికా పదుకొనేతో డేటింగ్‌కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. దీని గురించి లక్ష్మీరాయ్ బహిరంగంగా స్పందించారు.
తాజాగా నటి తమన్నా తన గురించి వచ్చిన పుకార్లపై స్పందించారు. ఆమె భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు గతంలో చాలా సార్లు వచ్చాయి. అయితే ఆమె ఇప్పుడు మొదటిసారిగా ఈ విషయంపై వివరణ ఇచ్చారు.

అబ్దుల్ రజాక్‌తో పుకార్లు:
అబ్దుల్ రజాక్‌తో కలిసి ఒక నగల దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లానని.. ఆ కార్యక్రమంలో కలిసి ఫోటోలు దిగామని తమన్నా వెల్లడించారు. కేవలం ఆ ఫోటోల కారణంగానే తమ ఇద్దరి మధ్య ఏదో ఉందని ప్రజలు ఊహించుకున్నారని ఆమె వివరించారు. ఈ పుకార్ల వల్ల తాను అబ్దుల్ రజాక్‌కు క్షమాపణలు చెబుతున్నానని, ఆయనకు అప్పటికే పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పుడు టీమిండియా కెప్టెన్‌గా ఎవరో తెలుసా..?
విరాట్ కోహ్లితో పుకార్లు:
కోహ్లీ, తమన్నా విషయంలోనూ ఇలాంటి పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలో తమన్నా ఆ పుకార్లపై స్పందించారు. విరాట్ కోహ్లీని కేవలం ఒక ప్రకటన షూటింగ్‌లో మాత్రమే కలిశానని, ఆ తర్వాత మళ్లీ కలుసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. కొన్నిసార్లు ఇలాంటి వార్తలు బాధ కలిగించినా, ప్రతిసారీ వాటి గురించి వివరణ ఇచ్చుకోవడం కష్టం కాబట్టి, వాటిని పట్టించుకోవడం మానేశానని తమన్నా అన్నారు. ఈ వార్తలపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.