For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీబీఎల్‌తో పాటు షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌కు అందుబాటులో స్మిత్, వార్నర్

By Nageshwara Rao
Tainted Australian cricketers may play the Sheffield Shield this season

హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఇంగ్లీషు గడ్డపై ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో కూడా దారుణంగా విఫలమైంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్డేల్లో ఘోర ఓటమి పాలైంది. ఆదివారం జరిగే ఐదో వన్డేలో కూడా ఓడితే వైట్ వాష్ ఖాయం.

ఈ ఏడాది మార్చిలో సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు ప్రణాళికలు రచించిన ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా, బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన కామెరూన్ బాన్ క్రాప్ట్‌పై తొమ్మిది నెలలు పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ త్వరలోనే దేశవాళీ క్రికెట్‌ ఆడేందుకు మార్గం సుగమం అయింది. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం అవుతుండగా అది ఏప్రిల్ వరకు కొనసాగనుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఇటీవలే క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది.

ఈ షెడ్యూల్‌లో ప్రకారం ఆస్ట్రేలియాలో జరిగే ఫస్ట్ క్లాస్ సీజన్ రెండో అర్ధభాగం ఫిబ్రవరి 23, 2019 నుంచి ఆరంభం కానుంది. ఇక, షెఫీల్డ్ షీల్డ్ పైనల్ మార్చి 28 నుంచి ఆరంభం కానుంది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నల్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన ఏడాది పాటు నిషేధం కూడా మార్చి 28తో ముగియనుంది.

ఆ తర్వాత జరిగే బిగ్ బాష్ లీగ్‌కు కూడా స్మిత్, వార్నర్ అందుబాటులో ఉండనున్నారు. బిగ్ బాష్ లీగ్‌లో ఈ ఇద్దరూ న్యూ సౌత్ వేల్స్ బ్లూస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో ఆ జట్టు యాజమాన్యం వీరిద్దరిని తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత జరిగే ఐపీఎల్‌కు కూడా స్మిత్, వార్నర్ అందుబాటులో ఉంటారు.

ఇప్పటికీ వీరిద్దరికీ కెనడాలో జరిగే గ్లోబల్ టీ20 లీగ్‌లో ఆడేందుకు అనుమతి లభించింది. ఈ ఇద్దరూ కూడా బరిలోకి దిగనున్నారు. ఈ టీ20 లీగ్‌లో స్టీవ్ స్మిత్ టొరెంటో నేషనల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుండగా, డేవిడ్ వార్నర్ విన్నీపెగ్ హాక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ఈ టోర్నీలో ఆడటం ద్వారా వచ్చిన సొమ్మంతా కెనడా, ఆస్ట్రేలియా‌లలో క్రికెట్ కార్యక్రమాలు నిర్వహించేందుకు స్టీవ్ స్మిత్ విరాళంగా ఇవ్వనున్నాడు. కెనడాలో క్రీడా కార్యక్రమాలను ప్రోత్సహించేలా ప్రచారంలో కూడా పాల్గొననున్నాడు. మరోవైపు ఈ టీ20 లీగ్ అనంతరం డేవిడ్ వార్నర్ కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో ఆడనున్నాడు.

ఈ మేరకు డేవిడ్ వార్నర్‌తో సెయింట్ లుసికా స్టార్స్ జట్టు ఒప్పందం కుదుర్చుకుంది. టోర్నీలో భాగంగా డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియాకు చెందిన డిఆర్సీ షార్ట్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఆస్ట్రేలియా-ఏ జట్టు ఈ ఏడాది ఆగస్టు నెలలో ఇండియాలో పర్యటించనుంది. భారత్ పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా-ఏ జట్టులో డిఆర్సీ షార్ట్‌ చోటు దక్కించుకున్నాడు.

మార్చి 2012 తర్వాత డేవిడ్ వార్నర్ కబేరియన్ గడ్డపై టీ20 క్రికెట్ ఆడేందుకు తొలిసారి వెళ్తున్నాడు. డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు 243 టీ20లు ఆడగా... అందులో 70 అంతర్జాతీయ టీ20లు ఉన్నాయి. టీ20ల్లో మొత్తం వార్నర్ 7,668 పరుగులు చేయగా, ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి.

Story first published: Friday, June 22, 2018, 17:31 [IST]
Other articles published on Jun 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+