హైదరాబాద్: కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) క్రికెట్ అభిమానులకు బాగా వినోదాన్ని పంచుకుంది. అలాగే ఆటగాళ్లు దురుసుగా కూడా ప్రవర్తిస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాకు చెందిన తబ్రైజ్ షంసి అనే ఆటగాడు మైదానంలో కాస్త అతి చేశాడు. ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌ను తిరస్కరించాడని అతను అంపైర్‌పై దాడికి యత్నించేంత పని చేశాడు.
అంపైర్ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని షంసి, అంపైర్ వైపు చూస్తూ ఆగ్రహంతో మైదానంలోనే నానా రభస చేశాడు. ఇది లెవల్ 2 కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించడమే అని స్పష్టంచేసిన రిఫరీ మ్యాచ్ అనంతరం అతని మ్యాచ్ ఫీజులో సగం కోత విధించాడు.
మైదానంలో వింత హావభావాలు, వికెట్ పడినపుడు అతను చేసుకునే సంబరాలు చాలా వింతగా అనిపిస్తాయి. కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లోనే తబ్రైజ్ షంసి సెలబ్రేషన్స్ మైదానంలోని ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా, ఐపీఎల్‌లో షంసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున ఆడుతున్నాడు.
అయితే మ్యాచ్ అనంతరం తాను అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని షంసి అన్నాడు. అంతేకాదు అంపైర్ పట్ల తన తీరుపై షంసి క్షమాపణలు కూడా చెప్పాడు.