Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మిథాలీ రాజ్ బయోపిక్‌లో తాప్సీ .. గర్వపడేలా చేస్తానని పొన్ను హామీ!!

Taapsee Pannu Confirms Mithali Raj Biopic Shabaash Mithu on Latters Birthday


హైదరాబాద్: భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌, సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ వస్తున్న విషయం తెలిసిందే. మిథాలీ బయోపిక్‌లో బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్‌ తాప్సీ పొన్నుటైటిల్‌ పాత్రలో నటించనుంది. ఈ రోజు మిథాలీ రాజ్ బర్త్‌డే సందర్భంగా తాప్సీ ఈ విషయం అధికారికంగా వెల్లడించింది. 'శభాష్‌ మిథు' పేరుతో దర్శకుడు రాహుల్ ధోలాకియా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తోంది.
#CineBox : Taapsee Pannu Confirms Mithali Raj Biopic !
హ్యాపీ బర్త్‌డే కెప్టెప్‌ మిథాలీ:

హ్యాపీ బర్త్‌డే కెప్టెప్‌ మిథాలీ:

మిథాలీ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా.. హ్యాపీ బర్త్‌డే కెప్టెప్‌ మిథాలీ రాజ్‌ అంటూ సోషల్‌ మీడియాలో తాప్సీ పోస్ట్‌ చేశారు. 'ఈ అవకాశం రావడం గర్వకారణం. నిన్ను నువ్వు స్క్రీన్‌పై చూసుకున్నప్పుడు గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తాను. అదే నేను నీకు ఇచ్చే బర్త్ డే గిఫ్ట్' అంటూ ట్వీట్ చేసింది. తాను కవర్‌డ్రైవ్‌ ఎలా ఆడాలో నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తాప్సీ పేర్కొంది.

జులన్ గోస్వామి బయోపిక్ కూడా:

జులన్ గోస్వామి బయోపిక్ కూడా:

క్రికెట్ దిగ్గజాలైన మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్‌ల మీద వచ్చిన బయోపిక్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అదే స్ఫూర్తితో మిథాలీ జీవితక‌థ ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా సిద్దమవుతోంది. పరిణితీ చోప్రా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ కోసం బ్యాడ్మింటన్‌లో ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. మహిళా క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పిన భారత ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామిపై కూడా ఓ బయోపిక్ తీయనున్నారు.

16 ఏళ్ల వ‌య‌సులో అరంగేట్రం:

16 ఏళ్ల వ‌య‌సులో అరంగేట్రం:

16 ఏళ్ల వ‌య‌సులో 1999లో వ‌న్డేల్లో అరంగేట్రం చేసిన మిథాలీ.. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సెంచ‌రీ చేసింది. ఇక 19 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 214 పరుగులు చేసి టెస్టుల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు సాధించింది. 18 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మిథాలీ రాజ్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇటీవలే వన్డేల్లో వ‌రుస‌గా ఏడు అర్ధ సెంచ‌రీలు చేసిన తొలి క్రికెట‌ర్‌గా రికార్డు సృష్టించింది.

పైనల్లో ఓటమి:

పైనల్లో ఓటమి:

వ‌న్డే అరంగేట్రం చేసిన త‌ర్వాత వ‌రుస‌గా 15 ఏళ్లు పాటు మిథాలీ యావరేజి 40కి పైగా ఉండటం విశేషం. స‌చిన్ కూడా స‌రిగ్గా ఇన్నేళ్ల పాటు 40కి పైగా యావరేజితో ప‌రుగులు చేసాడు. 2008-12 మధ్యలో ఐదేళ్లు మిన‌హాయిస్తే.. 2004 నుంచి భారత మహిళల జట్టుకి మిథాలీ కెప్టెన్‌గా ఉంది. మిథాలీ నేతృత్వంలోని భారత మహిళా జట్టు ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌కు వెళ్లింది. పైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది.

వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు:

వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు:

అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో మిథాలీ రాజ్ అనేక రికార్డులను సృష్టించింది. మ‌హిళ‌ల వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన క్రికెటర్‌గా మిథాలీ చరిత్ర సృష్టించింది. మిథాలీ భారత్ తరఫున 10 టెస్టులు, 209 వన్డేలు, 89 టీ20లు ఆడింది. టెస్టులలో 663, వన్డేలలో 6888, టీ20లలో 2364 పరుగులు చేసింది.

Story first published: Tuesday, December 3, 2019, 14:39 [IST]
Other articles published on Dec 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+