Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs CAN: పాకిస్థాన్ ఓడితే పరిస్థితేంటి? సూపర్-8కు ఛాన్స్ ఉంటుందా?

టీ20 వరల్డ్ కప్‌-2024లో పాకిస్థాన్‌కు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో కంగుతిన్న పాక్ తర్వాత భారత్ జోరు ముందు నిలవలేకపోయింది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమై ఓటమి చవి చూసింది. ఆడిన రెండింట్లో ఓడి సూపర్-8‌కు అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.

గత టీ20 వరల్డ్ కప్‌లోనూ పాకిస్థాన్ తొలుత భారత్‌తో పాటు జింబాబ్వే చేతిలో పరాజయం పాలైంది. కానీ ఆ తర్వాత గొప్పగా పుంజుకుని ఫైనల్‌కు చేరింది. కానీ టైటిల్ పోరులో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలై కప్‌ను చేజార్చుకుంది.
అయితే అదే తరహాలో పాకిస్థాన్ మరోసారి అసాధారణంగా చెలరేగి సూపర్-8కు అర్హత సాధించాలని భావిస్తోంది.
ఈ క్రమంలో ఇవాళ కీలక సమరానికి సిద్ధమైంది. నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో కెనడాతో తలపడనుంది.

T20WC What Happens to Super-8 Chances if Pakistan Loses to Canada

కెనడాను అంత తేలికగా తీసుకోలేని పరిస్థితి లేదు. ఐర్లాండ్‌పై కెనడా విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. అంతేగాక అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో కెనడా ఓటమిపాలైనప్పటికీ గొప్పగానే పోరాడింది. సమష్టిగా పోరాడి పాకిస్థాన్‌కు షాక్ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక గ్రూప్-ఏలో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ (4 పాయింట్లు), అమెరికా (4 పాయింట్లు), కెనడా (2 పాయింట్లు), పాకిస్థాన్, ఐర్లాండ్ వరుసగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సూపర్-8కు అర్హత సాధించాలంటే కెనడాతో పాటు ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ తప్పక గెలవాలి. అంతేగాక భారత్, అమెరికా ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవాళ జరగనున్న కెనడా మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడినా, భారత్, అమెరికా రెండు జట్లు ఆరు పాయింట్లతో లీగ్ స్టేజ్ ముగించినా పాకిస్థాన్ ఇంటిముఖం పట్టాల్సిందే. గ్రూప్ స్టేజ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.

పాకిస్థాన్ తుది జట్టు (అంచనా)
మహ్మద్ రిజ్వాన్, సయిమ్ అయుబ్, బాబర్ అజామ్, ఫకార్ జమాన్, షాదబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీమ్/అజామ్ ఖాన్, షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవూఫ్, మహ్మద్ అమీర్

కెనడా తుది జట్టు (అంచనా)
ఆరోన్ జాన్సన్, నవనీత్, పర్గాత్ సింగ్, దిల్‌ప్రీత్ బజ్వా, నికోలస్ కిర్టాన్, శ్రేయస్ మొవ్వ, హైలింగర్, జఫర్, జునాయ్ సిద్ధిఖి, గొర్డాన్.

Story first published: Tuesday, June 11, 2024, 15:50 [IST]
Other articles published on Jun 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+