For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంకతో భారత్ టీ20 మ్యాచ్: యువ క్రికెటర్లకు సువర్ణావకాశం

By Nageshwara Rao
T20I preview: Focus on India second-choice players

హైదరాబాద్: ముక్కోణపు టీ20 సిరిస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్-శ్రీలంక జట్లు మంగళవారం తలపడతున్నాయి. శ్రీలంకకు స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా దాహాస్‌ ట్రోఫీ పేరిట ఈ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో మూడో జట్టుగా బంగ్లాదేశ్ పాల్గొంటుంది. జాతీయ జట్టులో చోటు సంపాదించాలని కలలు కంటున్న యువ క్రికెటర్లకు ఇదో సువర్ణావకాశం.

ఈ టోర్నీలో చక్కటి ప్రదర్శన కనబరిస్తే, 2019 వన్డే జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం. ఈ ముక్కోణపు టీ20 సిరిస్‌తో టీమిండియా సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. 2019 వరల్డ్‌కప్ సన్నాహకాలకు ఏమాత్రం ఆటంకం కలుగకుండా.. రిజర్వ్ బెంచ్ సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో.. ఓ ద్వితీయ శ్రేణి జట్టుతో లంక గడ్డపై ముక్కోణపు టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది.

శ్రీలంకతో జరిగిన 14 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌ 10 నెగ్గింది. మరోవైపు ఈ ముక్కోణపు సిరిస్ జరిగే కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత జట్టు ఆడిన 7 టీ20ల్లో ఆరింటిలో గెలిచింది. ఇప్పటికే ఈ సీజన్‌లో స్వదేశం, విదేశంలో కలిపి శ్రీలంకతో టీమిండియా 18 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 6 టెస్టులు, 8 వన్డేలు, 4 టీ20లున్నాయి. టీమిండియా వీటన్నింటిలో క్లీన్‌స్వీప్ చేసింది.

యువ క్రికెటర్లకు గొప్ప అవకాశం

యువ క్రికెటర్లకు గొప్ప అవకాశం

ఇప్పుడు సీనియర్లు లేని రోహిత్‌ శర్మ నేతృత్వంలో యువ జట్టు ఏమేరకు ఆకట్టుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. సీనియర్ల గైర్హాజరీతో జట్టులోకి వచ్చిన కుర్రాళ్లకు ఇది గొప్ప అవకాశం. ప్రస్తుతం పరిమిత ఓవర్ల జట్టులో ఉన్న రెగ్యులర్ స్థానాలకు ప్రత్యామ్నాయాలు వెదుకుతున్న సెలక్టర్లను ఆకట్టుకోగలితే భవిష్యత్ టీమిండియాలో ఈ యువ క్రికెటర్లకు కచ్చితంగా అవకాశాలు వస్తాయి. ప్రస్తుతానికి భారత జట్టులో మిడిలార్డర్, రిజర్వ్ పేసర్ల కొరత చాలా ఉంది.

వరల్డ్ కప్‌కు 16 నెలల సమయం

వరల్డ్ కప్‌కు 16 నెలల సమయం

దీనికితోడు వన్డే వరల్డ్ కప్‌కు 16 నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఒక్క సిరీస్‌లో మెరిసినా టీమిండియాలో చోటు దక్కించుకున్నట్లే. ఈ టోర్నీలో భారత్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. జట్టు కూర్పు విషయానికి వస్తే, ఓపెనర్లుగా రోహిత్‌, ధవన్‌ రానుండగా సురేశ్‌ రైనా దక్షిణాఫ్రికాలో మూడో నెంబర్‌ ఆటగాడిగా రాణించాడు. ఈ సిరీస్‌లోనూ దూకుడు కనబరిచి వన్డే జట్టులో కూడా చోటు దక్కించుకోవాలని చూస్తున్నాడు.

ఆసక్తికరంగా తుది జట్టు ఎంపిక

ఆసక్తికరంగా తుది జట్టు ఎంపిక

మరోవైపు సఫారీ పర్యటనలో పెద్దగా రాణించని రోహిత్ శర్మ ఉపఖండ పిచ్‌లపై చెలరేగి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకు ఎదురుచూస్తున్నాడు. నాలుగో నెంబర్‌లో రాహుల్‌, మనీష్‌ పాండేల మధ్య పోటీ ఉంటుంది. ధోనీ లేకపోవడంతో వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌లలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరం. ఒకవేళ దినేశ్‌ కార్తీక్‌ ఈ అవకాశాన్ని దక్కించుకుంటే స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ స్థానం కోసం రిషబ్‌ పంత్‌, దీపక్‌ హూడా మధ్య పోటీ ఉంటుంది.

ప్రతీకారమే లక్ష్యంగా బరిలోకి దిగుతోన్న శ్రీలంక

ప్రతీకారమే లక్ష్యంగా బరిలోకి దిగుతోన్న శ్రీలంక

బౌలింగ్‌లో ఉనాద్కట్‌, ఠాకూర్‌ కొత్త బంతిని షేర్‌ చేసుకోనున్నారు. చాహల్‌తో పాటు అవకాశం దక్కని అక్షర్‌ పటేల్‌ స్పిన్నర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే జట్టు అదనపు పేసర్‌ను కోరుకుంటే సిరాజ్‌ జట్టులోకి రావచ్చు. ఒకవేళ ఆల్‌రౌండర్‌ కోసం చూస్తే వాషింగ్టన్‌ సుందర్‌‌కు చోటు కల్పించొచ్చు. మరోవైపు లంక ఈ సిరీస్‌లో గెలిచి భారత్‌పై ప్రతీకారమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గతంలో ఫార్మాట్లతో సంబంధం లేకుండా చిత్తుగా ఓడించిన తమకు ఇది గొప్ప అవకాశమని భావిస్తోంది.

 సీనియర్లతో చండీమాల్ నాయకత్వంలో బరిలోకి

సీనియర్లతో చండీమాల్ నాయకత్వంలో బరిలోకి

ఎందుకంటే భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లెవరూ ఆడకపోవడమే. ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌ని గెలిచిన ఆత్మవిశ్వాసంతో లంక బరిలోకి దిగుతోంది. టోర్నీకి ముందే కెప్టెన్‌ మాథ్యూస్‌, గుణరత్నెతో పాటు అరంగేట్ర వన్డేలోనే హ్యాట్రిక్‌ తీసిన పేసర్‌ మధుశంక గాయాల కారణంగా తప్పుకొన్నారు. అయితే చండీమాల్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న లంక మిగతా సీనియర్‌ ఆటగాళ్లతోనే ఆడనుంది.

టీ20 ఫార్మాట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో

టీ20 ఫార్మాట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో

ఉపుల్ తరంగ, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరాలో నైపుణ్యం ఉన్నా అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. బౌలింగ్‌లో లక్మల్, చమీరా, శనక, మిస్టరీ స్పిన్నర్ ధనంజయ భారత బ్యాటింగ్ లైనప్‌ను ఇబ్బందిపెడుతారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే టీ20 ఫార్మాట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. మిస్టరీ స్పిన్నర్‌ ధనంజయ బంతులకు భార త బ్యాట్స్‌మెన్‌ ఇబ్బందిపడే అవకాశం ఉంది.

భారత్‌:

భారత్‌:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, సురేశ్ రైనా, కేఎల్ రాహుల్‌, మనీశ్ పాండే, రిషబ్‌ పంత్/దినేశ్‌ కార్తీక్‌, వాషింగ్టన్‌ సుందర్‌/ దీపక్ హూడా, యజువేంద్ర చాహల్‌, శార్దూల్ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్, జయదేవ్ ఉనాద్కట్‌.

శ్రీలంక:

చండిమల్ (కెప్టెన్), కుశాల్ మెండిస్, గుణతిలక, కుశాల్ పెరీరా, ఉపుల్ తరంగ, శనక, తిసారా పెరీరా, అఖిల ధనంజయ, అమిలా అపోన్సో, లక్మల్, చమీరా.

పిచ్‌, వాతావరణం

ప్రేమదాస మైదానం ఎక్కువగా స్లో పిచ్‌. అయితే సిరీస్‌ ఆరంభంలో పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృత్తంగా ఉంటుంది.

ప్రత్యక్ష ప్రసారం: DSports/DDSports from 7 pm onwards

Story first published: Tuesday, March 6, 2018, 12:30 [IST]
Other articles published on Mar 6, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+