World Record: 4 ఓవర్లు.. 0 రన్స్.. టీ20 చరిత్రలోనే అరుదైన రికార్డ్!
World Record: టీ20 క్రికెట్లో బ్యాటర్ల బంతిని బాదడం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. భారీ సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడే ఈ రోజుల్లో.. ఒక ఓవర్ మెయిడెన్ వేయడమే బౌలర్లకు కష్టంగా మారింది. అలాంటిది ఓ మ్యాచ్‌లో తాను వేసిన మొత్తం 4 ఓవర్లను మెయిడెన్లుగా మలచి, ఒక్క రన్ కూడా ఇవ్వకుండా ప్రపంచ రికార్డు సృష్టించాడు ఓ బౌలర్. ఈ ఘనత సాధించిన ముగ్గురు అంతర్జాతీయ బౌలర్ల జాబితాలో భారత సంతతికి చెందిన ఆటగాడు కూడా ఉండటం విశేషం.
హాంగ్‌కాంగ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పేసర్ ఆయుష్ శుక్లా టీ20 క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డును నెలకొల్పాడు. మంగోలియాతో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఆయుష్ శుక్లా ఈ అద్భుతాన్ని చేశాడు. తాను వేసిన 4 ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఒక వికెట్ పడగొట్టి ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ మ్యాచ్‌లో మంగోలియా జట్టు కేవలం 17 పరుగులకే ఆలౌట్ అయింది.

క్రికెట్ ప్రపంచంలో హాంగ్‌కాంగ్ పేరును మార్మోగించిన 23 ఏళ్ల ఆయుష్ శుక్లా.. మరెక్కడో కాదు ఇండియాలోనే జన్మించాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా బోయిసర్ ప్రాంతంలో జన్మించిన ఆయుష్ శుక్లా.. ఆ తర్వాత హాంగ్‌కాంగ్ జట్టులో స్థానం సంపాదించుకుని ఈ ఘనత సాధించిన తొలి ఆసియా బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. 2024 ఆసియా కప్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఔట్ చేయడం తన కెరీర్లోనే అత్యంత చిరస్మరణీయమైన క్షణమని ఆయుష్ శుక్లా చెబుతుంటాడు. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ స్వయంగా ఆయుష్ శుక్లాతో ఫోటో దిగి అభినంగించాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇలా 4 ఓవర్లు మెయిడెన్ వేసిన రికార్డు ఇప్పటివరకు ముగ్గురు బౌలర్లకు మాత్రమే సాధ్యమైంది. ఆయుష్ శుక్లా కంటే ముందు కెనడాకు చెందిన సాద్ బిన్ జాఫర్ 2021లో పనామా జట్టుపై ఈ ఫీట్ సాధించగా.. న్యూజిలాండ్ స్టార్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ 2024 టీ20 ప్రపంచకప్‌లో పాపువా న్యూగినియాపై 4 ఓవర్లు మెయిడెన్ వేసి 3 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం ఆయుష్ శుక్లా తన కెరీర్‌లో ఆడిన 62 మ్యాచుల్లో 58 వికెట్లు తీసి నిలకడైన ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications