T20 World Cup: గుడ్‌న్యూస్.. ఫ్రీగా లైవ్ చూడొచ్చు! ఎక్కడంటే?
క్రికెట్ అభిమానులకు డిస్నీ హాట్‌స్టార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ ప్రపంచకప్‌ను మొబైల్స్‌లో ఫ్రీగా చూడొచ్చు. ఈ మెగా సమరాన్ని ఫోన్‌లో వీక్షించడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లో ఉచితంగా చూడొచ్చు.
అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 20 దేశాల మధ్య ఈసారి టీ20 ప్రపంచకప్ జరగనుంది. 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. టీమిండియా తమ లీగ్ మ్యాచ్‌లన్నీ అమెరికాలో ఆడనుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు టీమిండియా మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్‌తో పాటు ఐర్లాండ్, కెనడా, యూఎస్‌ఏ ఉన్నాయి. జూన్ 5న ఐర్లాండ్‌తో భారత్ మొదటి మ్యాచ్‌ను ఆడనుంది. స్థానికంగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. జూన్ 9న పాకిస్థాన్‌తో, జూన్ 12న ఆతిథ్య జట్టు అమెరికాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ న్యూయార్క్ వేదికగా జరగనున్నాయి. జూన్ 15న కెనడాతో భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఫ్లోరిడా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ స్థానికంగా ఉదయం 10.30 గంటలకు మొదలవుతుంది.
ఇక గ్రూప్-బీలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్‌లాండ్, ఓమన్.. గ్రూప్-సీలో న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, ఉగాండ, పపువా న్యూగెనియా.. గ్రూప్-డీలో సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. జూన్ 1 నుంచి 18 వరకు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
నాలుగు గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. జూన్ 19 నుంచి 24 వరకు సూపర్ 8 మ్యాచ్‌లు జరగుతాయి. సూపర్-8లో టాప్-4లో నిలిచిన జట్లు జూన్ 26(గయానా), 27(ట్రినిడాడ్) తేదిల్లో సెమీఫైనల్ మ్యాచ్‌లు ఆడుతాయి. జూన్ 29న బార్బోడస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications