Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: అఫ్గానిస్థాన్‌పై వెస్టిండీస్ సంచలన విజయం

వెస్టిండీస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. అఫ్గానిస్థాన్‌ను చిత్తుగా ఓడించి అజేయంగా సూపర్-8కు దూసుకెళ్లింది. సెయింట్ లూసియా వేదికగా మంగళవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గాన్‌పై విండీస్ 104 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. నికోలస్ పూరన్ (98; 53 బంతుల్లో, 6 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో మొదట వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 218 పరుగులు చేసింది.

ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (43; 27 బంతుల్లో, 8 ఫోర్లు) రాణించారు. కెప్టెన్ పావెల్ (26; 15 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), షై హోప్ (25; 17 బంతుల్లో, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. గుల్బాదిన్ నైబ్ (2/14) రెండు వికెట్లు, నవీనుల్ హక్ (1/41), అజ్మతుల్లా (1/41) తలో వికెట్ తీశారు. అయితే వెస్టిండీస్‌ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (7; 6 బంతుల్లో, 1 ఫోర్)ను అజ్మతుల్లా ఔట్ చేశాడు.

T20 World Cup West Indies Sensational Victory Over Afghanistan

వన్‌డౌన్‌లో వచ్చిన పూరన్ ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చాడు. అజ్మతుల్లా వేసిన నాలుగో ఓవర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మూడు సిక్సర్లు, రెండు బౌండరీలు, ఎక్సట్రాలతో ఏకంగా 36 పరుగులు పిండుకున్నాడు. చార్లెస్ కూడా బ్యాటు ఝుళిపించడంతో విండీస్ పవర్‌ప్లేలో 92/1తో రికార్డు స్కోరు సాధించింది. అనంతరం అఫ్గాన్ బౌలర్లు స్కోరు వేగాన్ని కంట్రోల్ చేశారు. దీంతో పది ఓవర్లకు విండీస్ 113/2 చేసింది. మధ్యలో కాస్త స్లో అయిన పూరన్ ఆఖర్లో గేర్ మార్చాడు.

18వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 24 పరుగులు సాధించాడు. అయితే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న పూరన్ ఆఖరి ఓవర్‌లో 98 పరుగుల వద్ద రనౌటయ్యాడు. కాగా, అనంతరం ఛేదనలో అఫ్గానిస్థాన్ 16.2 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ (38; 28 బంతుల్లో, 5 ఫోర్లు,1 సిక్సర్) టాప్ స్కోరర్. ఒబెడ్ మెక్కాయ్ (3/14) మూడు, అకీల్ హొస్సేన్ (2/21), మొయెట్జీ (2/28) చెరో రెండు వికెట్లు తీశారు.

ఛేదనలో ఏ దశలోనూ అఫ్గానిస్థాన్ విజయం దిశగా సాగలేదు. ఇన్నింగ్స్ మూడో బంతికే ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్‌ను డకౌట్ చేసింది. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ అఫ్గాన్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. అఫ్గాన్ బ్యాటర్లలో నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు.

Story first published: Tuesday, June 18, 2024, 10:33 [IST]
Other articles published on Jun 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+