Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: తొలి రౌండ్‌లోనే వైదొలగడానికి వాళ్లే కారణం!- కేన్ విలియమ్సన్

టీ20 వరల్డ్ కప్‌-2024లో అంచనాలు తలకిందులయ్యాయి. న్యూజిలాండ్, పాకిస్థాన్ వంటి బలమైన జట్లు సూపర్-8కు అర్హత సాధించలేకపోయాయి. అమెరికా, బంగ్లాదేశ్ తదుపరి దశకు దర్జాగా క్వాలిఫై అయ్యాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో కివీస్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి. గ్రూప్-సీలో ఉన్న న్యూజిలాండ్‌ను వెనక్కినెట్టి వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ ముందుకు సాగాయి.

అయితే వరల్డ్ కప్‌లో తొలి రౌండ్‌లోనే తమ జట్టు నిష్క్రమించడానికి గల కారణాలను కేన్ విలియమ్సన్ వివరించాడు. పసికూన పపువా న్యూ గినియాపై విజయానంతరం మాట్లాడాడు. ట్రిండాడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండ్ షోతో విజృంభించి ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.మొదట బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా 19.4 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. చార్లెస్ అమిని (17; 25 బంతుల్లో, 2 ఫోర్లు) టాప్ స్కోరర్.

T20 World Cup We Faced Two Challenging Teams with Good Knowledge of the Conditions- Kane Williamson

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించారు. ఫెర్గూసన్ నాలుగు ఓవర్లు మెయిడిన్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. సౌథి (2/11), ట్రెంట్ బౌల్ట్ (2/14), సోధి (2/29) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనకు దిగిన కివీస్ 12.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. డెవాన్ కాన్వే (35; 32 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. కేన్ విలియమ్సన్‌ (18 నాటౌట్; 17 బంతుల్లో, 2 ఫోర్లు), డారిల్ మిచెల్‌ (19 నాటౌట్; 12 బంతుల్లో, 3 ఫోర్లు) అజేయంగా నిలిచారు.

కాగా, విజయానంతరం కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ పిచ్ పరిస్థితులను గొప్పగా అర్థం చేసుకుని తమపై విజయం సాధించాయని తెలిపాడు. ఆ రెండు జట్ల చేతిలో ఓటమి తమ కొంపముంచిందని అన్నాడు. ట్రెంట్ బౌల్ట్ తన చివరి వరల్డ్ కప్ అని ప్రకటించడం ఎంతో బాధగా ఉందని విలియయ్సన్ అన్నాడు. ''ఏ టోర్నీమెంట్‌‌కు బరిలోకి దిగినా సత్తాచాటడానికే ప్రయత్నిస్తుంటాం. మేం మొదట రెండు సవాలైన జట్లను, ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉన్న అఫ్గానిస్థాన్, వెస్టిండీస్‌తో తలపడ్డాం''

''ప్రతి టోర్నమెంట్ ముగింపుగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ట్రెంట్ బౌల్ట్‌కు ఇదే తన చివరి ఐసీసీ టోర్నీ. అతడు వెళ్లిపోవడం చాలా బాధగా ఉంది. కానీ అంతర్జాతీయ క్రికెట్ అంటే స్వభావం ఇలానే ఉంటుంది. బౌల్ట్ ఎంతో శ్రమించాడు. ఎలా ఆడాలో స్పష్టమైన అవగాహనతో ఉంటాడు. మాకు మంచి ఆరంభాలు అందించాడు. ఐసీసీ టోర్నీల్లో, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు'' అని కేన్ విలియమ్సన్ అన్నాడు.

Story first published: Tuesday, June 18, 2024, 9:34 [IST]
Other articles published on Jun 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+