For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virat Kohli: ఎంతమంది యువ ఆటగాళ్లు వచ్చినా.. కోహ్లీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: సెహ్వాగ్‌

T20 World Cup: Virender Sehwag says It wont be right to question Virat Kohlis place in T20Is
T20 World Cup : Virat Kohli లా ఎవ్వరూ ఉండలేరు! - Virender Sehwag || Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత జట్టులోకి ఎంతమంది యువ ఆటగాళ్లు వచ్చినా.. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయలేరని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్‌ సెహ్వాగ్‌ అన్నాడు. చాలా కాలంగా కోహ్లీ గొప్పగా రాణిస్తున్నాడన్నాడు. టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా సోమవారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీకి బదులుగా సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో టీ20ల్లో కోహ్లీ బ్యాటింగ్‌ స్థానంపై ప్రశ్నలు లేవనెత్తడం సరికాదని సెహ్వాగ్‌ అన్నాడు. ప్రపంచకప్‌ 2021లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. పూర్తిగా నిరాశపర్చింది. మెగా టోర్నీలో కనీసం సెమీస్‌కు కూడా చేరకుండానే ఇంటిదారిపట్టింది. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాజయాలే కోహ్లీసేన కొంపముంచింది.

కోహ్లీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు

కోహ్లీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు

తాజాగా క్రిక్‌బజ్‌లో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్‌ సెహ్వాగ్‌ మాట్లాడుతూ... 'టీమిండియాలోకి ఎంతమంది యువ ఆటగాళ్లు వచ్చినా.. విరాట్‌ కోహ్లీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. బ్యాటుతో చాలా కాలంగా కోహ్లీ గొప్పగా రాణిస్తున్నాడు. అతడి నిలకడ అద్భుతం. కోహ్లీ కోరుకున్నంత కాలం టీ20ల్లో ఆడుతూనే ఉంటాడు. కోహ్లీ బ్యాటింగ్‌కు దిగే స్థానంపై సందేహాలు అక్కర్లేదు. అతని స్థానాన్ని ప్రశ్నించడం సరైనది కాదు. విరాట్ ఎప్పుడు, ఎక్కడైనా పరుగులు చేస్తాడు' అని పేర్కొన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో సెహ్వాగ్ 104 టెస్టుల్లో, 251 వన్డేల్లో, 19 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

జట్టు నిండా పవర్‌ హిట్టర్లుంటే సరిపోదు

జట్టు నిండా పవర్‌ హిట్టర్లుంటే సరిపోదు

టీమిండియా మాజీ పేసర్ ఆశిశ్‌ నెహ్రా కూడా వీరేందర్‌ సెహ్వాగ్ అభిప్రాయాన్ని సమర్థించాడు. 'బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ అంత స్థిరత్వంతో ఎవరూ రాణించలేరు. జట్టు నిండా పవర్‌ హిట్టర్లుంటే సరిపోదు. కీలక సమయాల్లో జట్టును గట్టెక్కించగల సీనియర్లు కూడా ఉండాలి. విరాట్ ఏదైనా చేస్తాడు.

ఎక్కడైనా పరుగులు చేయడానికే ప్రయత్నిస్తాడు' అని నెహ్రా పేర్కొన్నాడు. 2014, 2016 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. టీ20ల్లో విరాట్ 87 ఇన్నింగ్స్‌లు ఆడి.. 52.05 సగటుతో 3227 పరుగులు చేశాడు. ఇందులో 29 అర్ధ శతకాలున్నాయి.

వన్డే, టెస్టు ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉండాలి

వన్డే, టెస్టు ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉండాలి

టీ20 క్రికెట్ జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌లకు విరాట్ కోహ్లీ ఇప్పటికే గుడ్ బై చెప్పగా.. వన్డే, టెస్టు ఫార్మాట్‌ల నుంచి కూడా అతడిని తప్పించాలని కొందరు సోషల్ మీడియాలో అంటున్నారు. దాంతో విరాట్ కెప్టెన్సీ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ వీరేందర్‌ సెహ్వాగ్ స్పందించాడు. కోహ్లీ కెప్టెన్‌గా అద్భుతంగా జట్టును నడిపిస్తున్నాడని.. వన్డే, టెస్ట్‌లలో నాయకత్వ పాత్రను వదిలకూడదని వీరూ అభిప్రాయపడ్డాడు.

కోహ్లీ మిగతా రెండు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి పూర్తిగా తప్పుకోవాలా వద్దా అనే ఓ అభిమాని ప్రశ్నకు సెహ్వాగ్ ఇలా స్పందించాడు. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత భారత్ ఇంతవరకు ఐసీసీ టైటిల్‌ను గెలుచుకోలేదు. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. ఐసీసీ టోర్నమెంట్‌లలో జట్టు పేలవ ప్రదర్శనకు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.

Story first published: Tuesday, November 9, 2021, 13:21 [IST]
Other articles published on Nov 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+