For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2021: కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై.. నయా సారథిగా రోహిత్ శర్మ!!

T20 World Cup: Virat Kohli To Say Bye To Captaincy In White Ball Format New Captain Is Rohit Sharma

హైదరాబాద్: అందరూ ఊహించిందే నిజమవబోతోంది. టీమిండియా కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ త్వరలోనే వైదొలగబోతున్నాడు. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. ఈ మెగా టోర్నీ ముగిసిన అనంతరం కోహ్లీ వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ భారత జట్టు బాధ్యతలు అందుకోనున్నాడు. ప్రపంచకప్ అనంతరం రోహిత్ చేతికి పగ్గాలు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు కోహ్లీ ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి సమాచారమిచ్చాడని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.

 ఒక్క ఐసీసీ టైటిల్‌ లేదు:

ఒక్క ఐసీసీ టైటిల్‌ లేదు:

2014లో ఎంఎస్ ధోనీ నుంచి విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీని అందుకున్నాడు. మూడేళ్ల పాటు వన్డే, టీ20ల్లో ధోనీ సారథ్యంలో ఎన్నో మెళుకువలు నేర్చుకున్నాడు. ఇక 2017లో టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా విరాట్ బాధ్యతలు చేపట్టాడు. మరో రెండేళ్ల పాటు మహీ అతడికి తోడుగానే ఉన్నాడు. ఈ నాలుగేళ్ల కాలంలో కోహ్లీ కెప్టెన్సీలో ఇప్పటి వరకూ కనీసం ఒక్క ఐసీసీ టైటిల్‌ని కూడా భారత్ జట్టు గెలవలేదు. దాంతో పాటు ఐపీఎల్‌లో రోహిత్ శర్మ తన సారథ్యంతో అందరిని ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్ టీమ్‌‌ని ఐదుసార్లు విజేతగా నిలిపి అందరిని ఆశ్చర్యపరిచాడు.

మాజీలు కూడా:

మాజీలు కూడా:

రోహిత్ శర్మ ఐపీఎల్ ట్రోఫీలతో పాటు నిదహాస్ ట్రోఫీలోనూ కెప్టెన్‌గా భారత్ జట్టుని విజేతగా నిలిపాడు. అలానే గత రెండేళ్లుగా మైదానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి విలువైన సలహాలు ఇస్తూ.. భారత్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో కోహ్లీ ఐసీసీ టైటిల్స్‌తో పాటు ఐపీఎల్‌లోనూ కనీసం ఒక్కసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ని విజేతగా నిలపలేకపోయాడు. దాంతో గత రెండేళ్ల నుంచి రోహిత్ చేతికి వన్డే, టీ20 పగ్గాలివ్వాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. మాజీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చివరకు కోహ్లీనే స్వయంగా పరిమిత ఓవర్ల బాధ్యత నుంచి తప్పుకుంటున్నాడు.

 కోహ్లీనే స్వయంగా:

కోహ్లీనే స్వయంగా:

మూడు ఫార్మాట్లలో సారధ్య బాధ్యతలు బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విరాట్ కోహ్లీనే స్వయంగా ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక టెస్ట్‌ కెప్టెన్సీపై పూర్తి ఫోకస్‌ ఉంచాలని విరాట్ భావిస్తున్నట్లు అతని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మంచి ట్రాక్‌ రికార్డు కలిగిన రోహిత్‌ శర్మకు టీమిండియా పరిమిత ఓవర్ల పగ్గాలు అప్పగించేందుకు బీసీసీఐ కూడా సముఖంగా ఉందట. రోహిత్‌కు బాధ్యతలు ఇవ్వాలని కోహ్లీ కూడా ప్రతిపాదించాడట. ఇక టెస్టు టీమ్ కెప్టెన్‌గా మాత్రమే కోహ్లీ ఉండనున్నాడు. మొత్తానికి టీ20 ప్రపంచకప్ అనంతరం భారత జట్టుకు నయా సారథి రానున్నాడు.

ద్వైపాక్షిక సిరీస్‌ల్లో రాణిస్తున్నా:

ద్వైపాక్షిక సిరీస్‌ల్లో రాణిస్తున్నా:

విరాట్ కోహ్లీ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో జట్టును అద్భుతంగా నడిపిస్తున్నా.. కీలక ఐసీసీ ఈవెంట్లలో మాత్రం విఫలమవుతున్నాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్, ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ వరుసగా మూడు టోర్నీల్లో కోహ్లీకి చుక్కెదురైంది. ఈ మూడు టోర్నీల్లో కోహ్లీ కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్‌మన్‌గా విఫలమయ్యాడు. అదే భారత విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే కోహ్లీ కెప్టెన్సీకి ఈ టీ20 ప్రపంచకప్ చివరిది అయింది. అయితే ఎవరూ ఒత్తిడి తీసురానుండగా తానే స్వయంగా తప్పుకుంటుండడం విశేషం.



Story first published: Monday, September 13, 2021, 11:02 [IST]
Other articles published on Sep 13, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+