For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs PAK: టాస్ ఆలస్యం.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ అడ్డంకి

టీ20 వరల్డ్ కప్‌లో మహా సంగ్రామం ప్రారంభానికి అంతరాయం ఏర్పడింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిన్నపాటి జల్లులు కురవడంతో టాస్‌ ఆలస్యం కానుంది. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7.30 గంటలకు టాస్ పడాల్సి ఉంది. కానీ టాస్ సమయానికి కొద్దిసేపు ముందే వర్షం పడింది. దీంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు.

టాస్ గురించి అంపైర్లతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ చర్చించారు. మరికాసేపట్లో అంపైర్లు పిచ్‌ను పరిశీలించి టాస్, మ్యాచ్ గురించి పూర్తి అప్‌డేట్ అందివ్వనున్నారు. ప్రస్తుతానికి తేలికపాటి జల్లులే ఉండటంతో మ్యాచ్ సజావుగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా, ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌ను వీక్షించడానికి దిగ్గజ క్రికెట్ సచిన్ టెండూల్కర్ స్టేడియానికి వచ్చాడు. యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా మైదానంలో సందడి చేస్తున్నారు.

T20 World Cup Toss Delay in India vs Pakistan Match Due to Wet Outfield

టీ20 వరల్డ్ కప్‌లో భారత్-పాకిస్థాన్ ఇప్పటివరకు ఏడు సార్లు తలపడ్డాయి. బౌల్ అవుట్‌తో కలిపి భారత్ ఆరు మ్యాచ్‌ల్లో గెలిచింది. పాకిస్థాన్ కేవలం ఒక్క విజయమే సాధించింది. 2007లో పాక్ గ్రూప్‌స్టేజ్‌లో పాటు ఫైనల్‌లోనూ చిత్తు చేసి భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా విజయకేతనం ఎగురవేసింది. అయితే 2021 మెగాటోర్నీలో టీమిండియాకు పాక్ షాక్ ఇచ్చింది. ఇక పొట్టి కప్‌లో చివరిసారిగా ఇరు జట్లు తలపడిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. విరాట్ కోహ్లి గొప్పగా ఆడి జట్టును గెలిపించాడు.

జట్టు వివరాలు
భారత్: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్య‌, యశస్వీ జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌, సంజు శాంసన్‌ , శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్

పాకిస్థాన్: బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, ఉస్మాన్ ఖాన్, ఫకర్ జమాన్, షాదబ్ ఖాన్, అజామ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, షాహిన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్, ఇమాద్ వసీమ్, సయీమ్ అయుభ్, అబ్బాస్ అఫ్రిది

Story first published: Sunday, June 9, 2024, 19:49 [IST]
Other articles published on Jun 9, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+