టీమిండియా యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మ టీ20 ప్రపంచకప్‌లో తప్పక చోటు సంపాదిస్తాడని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. వరల్డ్ కప్‌లో భారత జట్టుకు పవర్ హిట్టర్ జితేశ్ శర్మ అవసరమని అభిప్రాయపడ్డాడు. గతేడాది జరిగిన ఆసియన్ గేమ్స్‌లో జితేశ్ టీమిండియా తరపున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లే ఆడిన అతడు ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. 147 స్ట్రైక్‌రేటుతో 100 పరుగులు చేశాడు.
అయితే 2022లో పంజాబ్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన జితేశ్ మెరుగైన ప్రదర్శన చేశాడు. పరుగుల వరద పారించినప్పటికీ ప్రభావం చూపే ఇన్నింగ్స్‌లు ఆడాడు. 159 స్ట్రైక్‌రేటుతో 543 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న అఫ్గానిస్థాన్ సిరీస్‌లో సీనియర్ వికెట్ కీపర్ సంజు శాంసన్‌ను కాదని జితేశ్‌కు అవకాశాలు ఇస్తున్నారు.

తొలి టీ20లో 20 బంతుల్లో 31 పరుగులు చేశాడు. అయిదు బౌండరీలు బాదాడు. కానీ ఇండోర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఎదుర్కొన్న రెండో బంతికే భారీ షాట్‌కు యత్నించి డకౌటయ్యాడు. వన్డే ప్రపంచకప్ అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో 35, 24 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కానీ సౌతాఫ్రికాలో జరిగిన టీ20 సిరీస్‌లో తేలిపోయాడు. 1, 4 పరుగులే చేసి నిరాశపరిచాడు.
అయితే గణాంకాలతో కాకుండా సామర్థ్యం ఆధారంగా జితేశ్ శర్మ జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ ఎంపిక అవుతాడని పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. ''విధ్వంసకరంగా బ్యాటింగ్ చేసి సామర్థ్యం ఉన్న వికెట్ కీపర్‌ను తీసుకోవాలని టీమిండియా భావిస్తుంది. దిగువ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి సమర్థంగా ఆడాలి. జితేశ్ శర్మ ఈ బాధ్యతలను గొప్పగా నిర్వర్తిస్తాడని భావిస్తున్నా. ప్రపంచకప్‌కు అతడి ఎంపిక దాదాపు ఖరారైనట్టుగా భావిస్తున్నా. టికెట్ కన్ఫర్మ్ అయింది, ప్రింట్ తీసుకోవడమే కాస్త ఆలస్యం''

''తొలి టీ20లో అతడు పది ఓవర్లలోపే క్రీజులోకి వచ్చాడు. పరిస్థితులను అర్థం చేసుకుని తన స్టైల్‌కు విరుద్ధంగా చక్కగా ఆడాడు. కుదురుకోవడానికి సమయం తీసుకున్నాడు. దాంతో స్ట్రైక్‌రేట్ తగ్గింది. ఆ తర్వాత షాట్లు ఆడాడు. ఇన్నింగ్స్‌ను నిర్మించే సత్తా తనకి ఉందని తెలియజేశాడు'' అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. కాగా, జూన్‌లో వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి.