For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20WC: సూపర్-8 మ్యాచ్‌ల టైమింగ్స్ ఏంటి? రాత్రంతా మేల్కోవాలా? పూర్తి షెడ్యూల్!

టీ20 వరల్డ్ కప్-2024 లీగ్ దశ క్లైమాక్స్‌కు వచ్చేసింది. రేపు జరగనున్న న్యూజిలాండ్ వర్సెస్ పపువా న్యూ గినియా, వెస్టిండీస్ వర్సెస్ అఫ్గానిస్థాన్ పోరులతో లీగ్ స్టేజ్ ముగుస్తుంది. అయితే రేపటి మ్యాచ్‌లు కేవలం నామమాత్రమైనవే. నేపాల్‌పై బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించడంతో సూపర్-8కు అర్హత సాధించిన జట్లు అధికారికంగా ఖరారయ్యాయి.

గ్రూప్-ఏ నుంచి భారత్, అమెరికా; గ్రూప్-బీ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్; గ్రూప్-సీ నుంచి అఫ్గానిస్థాన్, వెస్టిండీస్, గ్రూప్-డీ నుంచి దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ తదుపరి దశకు అర్హత సాధించాయి. ఈ ఎనిమిది జట్లను ముందుగా నిర్ణయించిన సీడింగ్ ద్వారా రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. గ్రూప్-2లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అమెరికా, ఇంగ్లండ్ నిలిచాయి.

T20 World Cup Super-8 Match Timings Venues and Full Schedule Announced

ప్రతి జట్టు తమ గ్రూప్‌లో ఉన్న ప్రత్యర్థులతో ఓ మ్యాచ్ ఆడనుంది. అంతిమంగా ఆయా గ్రూప్‌ల్లో నిలిచిన టాప్-2 జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈ సూపర్ ఫైట్స్ జూన్ 19 నుంచి మొదలై జూన్ 25తో ముగుస్తాయి. ఆ తర్వాత జూన్ 26, జూన్ 27న సెమీఫైనల్స్, జూన్ 29న బార్బడోస్ వేదికగా ఫైనల్ జరగనుంది. అయితే భారత కాలమాన ప్రకారం సూపర్-8 మ్యాచ్‌లు కొన్ని రాత్రి 8 గంటలకు, మరికొన్ని ఉదయం 6 గంటలకు ప్రారంభం కానున్నాయి. టీమిండియా మ్యాచ్‌లన్నీ రాత్రి 8 గంటలకే మొదలవుతాయి.

సూపర్-8 పూర్తి షెడ్యూల్
జూన్ 19: అమెరికా వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా- రాత్రి 8 గంటలకు)
జూన్ 20: ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (లూసియా- ఉదయం 6 గంటలకు)
జూన్ 20: భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ (బార్బడోస్- రాత్రి 8 గంటలకు)
జూన్ 21: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (బార్బడోస్- ఉదయం 6 గంటలకు)
జూన్ 21: ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (లూసియా- రాత్రి 8 గంటలకు)
జూన్ 22: అమెరికా వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్- ఉదయం 6 గంటలకు)
జూన్ 22: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా- రాత్రి 8 గంటలకు)
జూన్ 23: అఫ్గానిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (విన్సెంట్- ఉదయం 6 గంటలకు)
జూన్ 23: అమెరికా వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్- రాత్రి 8 గంటలకు)
జూన్ 24: వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా- రాత్రి 6 గంటలకు)
జూన్ 24: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (లూసియా- రాత్రి 8 గంటలకు)
జూన్ 25: అఫ్గానిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (విన్సెంట్- ఉదయం 6 గంటలకు)

Story first published: Monday, June 17, 2024, 9:29 [IST]
Other articles published on Jun 17, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+