
మార్పులు చేయడం సరికాదు
పవర్ ప్లే ఓవర్లలో టీమిండియా బ్యాటింగ్ విధానం మారాల్సి ఉందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. 'జట్టులో చాలా మార్పులు చేయడం సరికాదు. ఎందుకంటే భారత్ తన అన్ని మ్యాచ్‌లలో ఓడిపోలేదు. రెండు మ్యాచ్‌లలో బ్యాటర్లు ఆశించిన రీతిలో ఆడలేకపోయారు. టీమిండియా ప్రస్తుతం ఇలా మధ్యలోనే టోర్నీ నుంచి నిష్క్రమించటానికి కారణం ఇదే అని నేను అనుకుంటున్నా.
ఈ విధానంలో మార్పు రావాలి' అని గవాస్కర్ అన్నారు. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లపై భారత్ బ్యాటింగ్ ఏమాత్రం బాగా లేదు. స్టార్ పేసర్లను ఎదుర్కోలేక భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు త్వరగా వికెట్లు కోల్పోయారు. అయితే పసికూనలపై మాత్రం చెలరేగి ఆడారు. నేపథ్యంలో సన్నీ వ్యాఖ్యలు చేశాడు.

ఆ విధానం మారాలి
'పవర్ ప్లేలో 30 యార్డ్ సర్కిల్ వెలుపల కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. గత కొన్ని ఐసీసీ టోర్నమెంట్‌లలో భారతదేశం దాని ప్రయోజనాన్ని పొందట్లేదు. అందుకే మంచి బౌలర్లు ఉన్న బలమైన జట్టుతో తలపడిన ప్రతిసారీ భారత్ భారీ స్కోర్లు చేయట్లేదు. కాబట్టి ఆ విధానం మారాల్సిన అవసరం ఉంది.
ఇక ఫీల్డింగ్‌లో అద్భుతమైన ఆటగాళ్లు ఉండాలి. న్యూజిలాండ్ ఆటగాళ్లు ఫీల్డింగ్ చేసిన విధానం, పరుగులు కాపాడడం, క్యాచ్‌లు పట్టిన తీరు బాగుంది. బౌలింగ్ అటాక్ సాధారణంగా ఉన్నప్పటికీ మంచి ఫీల్డింగ్ ఉంటే ఫలితం మరోలా ఉంటుంది.భారత జట్టును పరిశీలిస్తే.. ముగ్గురు, నలుగురు ఆటగాళ్లు మాత్రమే అత్యుత్తమ రీతిలో ఫీల్డింగ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా భారత్ మెరుగవ్వాల్సి ఉంది' అని సునీల్ గవాస్కర్ తెలిపారు.

కొత్త ఆలోచనలు అవసరం
'భారత జట్టులో ఏదో ఒక విధమైన మార్పు ఉండాలని నేను భావిస్తున్నాను. కానీ భారీ స్థాయిలో మాత్రం ఉండకూడదు. కొత్త ముఖాలు, ఆలోచనలు అవసరం. అది జరుగుతుందని నేను భావిస్తున్నా. టీ20 ప్రపంచకప్ 2021లో రాణించలేదని భారీ మార్పులు ఉండకూడదు. అలాంటివి పనికిరావు. తదుపరి ప్రపంచకప్‌కు ముందు భారత్ కనీసం 20 టీ20లు ఆడబోతోంది.
కాబట్టి కొంతమంది ఆటగాళ్లకు ఇది గొప్ప అవకాశం. ప్రస్తుతం సెలక్షన్ కమిటీ తప్పనిసరిగా ఆస్ట్రేలియా గురించి ఆలోచించాలి. ఆస్ట్రేలియాలో ఎలాంటి పిచ్‌లు ఉన్నాయి, బౌండరీల పరిమాణం లాంటి విషయాలను గుర్తుంచుకుని ఆటగాళ్లను ఎంచుకోవాలి' అని సన్నీ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












