Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: కోహ్లి.. ఇది గుర్తుపెట్టుకో- గోల్డెన్ డకౌట్‌పై స్పందించిన గవాస్కర్

టీ20 వరల్డ్ కప్‌కు తనని ఎంపిక చేయొద్దని చర్చ జోరుగా సాగుతున్న సమయంలో బ్యాటుతోనే విరాట్ కోహ్లి విమర్శకులకు సమాధానమిచ్చాడు. ఐపీఎల్‌లో పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. భారీ అంచనాలతో మెగాటోర్నీలో బరిలోకి దిగాడు. కానీ ప్రపంచకప్‌లో కోహ్లి వరుసగా 1, 4, 0 పరుగులతో అభిమానులను నిరాశపరుస్తున్నాడు.

ఆఖరి వరకు నిలబడి మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉన్న కోహ్లి తొలి వికెట్ రూపంలో మైదానానికి చేరుకుంటున్నాడు. న్యూయార్క్ వేదికగా బుధవారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా గోల్డెన్ డకౌటయ్యాడు. సౌరభ్ నేత్రావల్కర్ వేసిన బంతిని వెంటాడి వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. అయితే కఠిన ప్రత్యర్థులు లేకపోవడంతో కోహ్లి ఫామ్ కోల్పోయినా భారత్ లీగ్ స్టేజ్‌ను దాటేసింది. కానీ తర్వా సూపర్-8, సెమీస్, ఫైనల్‌లో భారత్ స్ట్రాంగ్ టీమ్స్‌తో తలపడాల్సి ఉంటుంది.

T20 World Cup Sunil Gavaskar Advises Virat Kohli to Show Patience and Have Faith in Himself

ఈ నేపథ్యంలో కోహ్లి గురించి మరోసారి చర్చ సాగుతోంది. అయితే కోహ్లి ఫామ్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. తక్కువ స్కోరు చేసినంత మాత్రాన బ్యాటింగ్ సరిగా చేయట్లేదని నిర్ధారించలేమని, కొన్ని చక్కని బంతులకు వికెట్ కోల్పోవచ్చని పేర్కొన్నాడు. కోహ్లిపై నమ్మకం ఉంచాలని, తిరిగి అతను గొప్పగా సత్తాచాటుతాడని గవాస్కర్ తెలిపాడు.

''ప్రతి ఆటగాడికి అత్యంత ప్రేరణ ఇచ్చే అంశం దేశం తరఫున మ్యాచ్‌లు గెలవడమే. కోహ్లి గత కొన్నేళ్లుగా దేశం కోసం ఎంతో చేశాడు, ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. అది తనకి గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు తొలి దశలోనే ఉన్నాం. కానీ ఆ తర్వాత సూపర్-8, సెమీఫైనల్స్, ఫైనల్స్ జరగనున్నాయి. ఈ స్థితిలో కోహ్లి చేయాల్సింది ఏంటంటే.. ఓపిక, ఆత్మవిశ్వాసంతో ఆడాలి. ఇది కోహ్లి తప్పక చేయగలడు''

''మూడు సార్లు స్వల్ప స్కోరుకే ఔటైనంత మాత్రాన కోహ్లి బ్యాటింగ్ సరిగా చేయట్లేదని భావించలేం. కొన్నిసార్లు మంచి బంతులకు వికెట్లు కోల్పోవాల్సి వస్తుంది. మరికొన్ని సార్లు స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ నుంచి బంతి బౌండరీకి వెళ్తుంటుంది. అమెరికాతో మ్యాచ్‌లో కోహ్లికి అలా జరగలేదు. కాబట్టి అతని గురించి ఆందోళన అవసరం లేదు. అతనిపై నమ్మకం ఉంచాలంతే. తప్పక సత్తాచాటుతాడు'' అని సునీల్ గవాస్కర్ అన్నాడు.

Story first published: Thursday, June 13, 2024, 13:31 [IST]
Other articles published on Jun 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+