Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup: భారత జట్టు ఇదే.. డీకే, పరాగ్‌కు నిరాశే!

టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 15 మందితో పాటు అయిదుగురు ఆటగాళ్లను స్టాండ్‌బై ప్లేయర్లగా ఎంపిక చేశారని సమాచారం. మొత్తంగా 20 మందితో కూడిన టీమిండియాను సెలక్ట్ చేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ జాబితాలో ఫామ్‌లో ఉన్న కొందరు ఆటగాళ్లకు నిరాశే మిగిలింది.

జూన్ 2వ తేదీ నుంచి టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగాటోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లన్నీ యూఎస్‌ఏలో, ఆ తర్వాత దశ పోరులన్నీ కరేబియన్‌లో దీవుల్లో జరగనున్నాయి. జూన్ 5న ఐర్లాండ్‌ పోరుతో టీమిండియా మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. జూన్ 9న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.

T20 World Cup Squad Announcement Disappointment for Dinesh Karthik and Riyan Parag

అయితే ఈ మెగాటోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలో టీమిండియా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జాబితా లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దాని ప్రకారం.. 15 మంది భారత జట్టుతో పాటు అయిదుగురు స్టాండ్ బై ప్లేయర్లు జట్టులో ఉన్నారు. రోహిత్ శర్మతో పాటు ఓపెనర్లుగా యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్ జట్టులో చోటు దక్కించుకున్నారు. వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్‌తో పాటు సంజు శాంసన్, కేఎల్ రాహుల్ ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్ జాబితాలో హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా,శివమ్ దూబె ఉన్నారు.

బౌలింగ్ విషయానికొస్తే బుమ్రాతో పాటు సిరాజ్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్ పేస్ బాధ్యతలు అందుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్‌దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, చాహల్; అలాగే స్పెషలిస్ట్ బ్యాటర్లుగా విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ జట్టులో ఉన్నారు. అయితే వాళ్లందరిలో అయిదుగురు స్టాండ్‌బై ‌ప్లేయర్లుగా పరిమితం కానున్నారు.

మరోవైపు ఈ ప్రచార 'భారత జట్టు'పై మిశ్రమ స్పందన వస్తోంది. ఫాస్ట్ బౌలర్ల ఎంపిక పేలవంగా ఉందని విమర్శిస్తున్నారు. బుమ్రా మినహా ఏ పేసర్ ఆకట్టుకునేలా లేరని నెటిజన్లు అంటున్నారు. అలాగే ఫామ్‌లో ఉన్న రియాన్ పరాగ్, దినేశ్ కార్తీక్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ స్థానంలో డీకేను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

జాతీయ మీడియాలో ప్రచారం అవుతున్న భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, బుమ్రా, సిరాజ్, అర్షదీప్, అవేశ్ ఖాన్.

Story first published: Wednesday, April 17, 2024, 20:15 [IST]
Other articles published on Apr 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+