Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: దక్షిణాఫ్రికా చరిత్రాత్మక విజయం..తొలిసారి ఫైనల్‌లో!

టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్స్‌కు దక్షిణాఫ్రికా అర్హత సాధించింది. ట్రిండాడ్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ప్రపంచకప్‌ చరిత్రలో సౌతాఫ్రికా తుదిపోరుకు చేరడం ఇదే తొలిసారి. గత వన్డే, టీ20 వరల్డ్ కప్‌ల్లో ఒక్కసారి కూడా సఫారీ సేన టైటిల్ పోరు వరకు చేరుకోలేదు.

మండకొడి పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి అఫ్గాన్ బ్యాటర్లు వణికిపోయారు. వరల్డ్ కప్ సెమీఫైనల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా అఫ్గాన్ అపకీర్తి మూటగట్టుకుంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (10; 12 బంతుల్లో, 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నాడు. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రా రూపంలో వచ్చిన 13 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

T20 World Cup South Africa Reaches First-Ever World Cup Final with Resounding Victory Over Afghanistan

అఫ్గాన్ 28 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన రషీద్ ఖాన్ (8; 8 బంతుల్లో, 2 ఫోర్లు), కరీమ్ జనత్ (8; 13 బంతుల్లో, 1 ఫోర్) ఏడో వికెట్‌కు 22 పరుగులు జోడించడంతో 50 పరుగులను దాటింది. లేదంటే ఆ మాత్రం స్కోరు కూడా సాధించలేకపోయేది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జేన్సన్ (3/16), షంసీ (3/6) చెరో మూడు వికెట్లతో విజృంభించారు. రబాడ (2/14), నోకియా (2/7) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు.

అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 8.5 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి విజయం సాధించింది. ఆదిలోనే డికాక్ (5; 8 బంతుల్లో, 1 ఫోర్) ఔటైనా రీజా హెండ్రిక్స్ (29 నాటౌట్; 25 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), మార్క్‌రమ్ (23 నాటౌట్; 21 బంతుల్లో, 4 ఫోర్లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఛేదన ప్రారంభంలో అఫ్గాన్ సఫారీలకు సవాల్ విసిరింది. డికాక్‌ను ఫజల్లా ఔట్ చేయడం, నవీనుల్ నిప్పులు చెరిగే బంతులు విసరడంతో సౌతాఫ్రికా 3 ఓవర్లకు 6/1 స్కోరుతో నిలిచింది.

కానీ ఆ తర్వాత అఫ్గాన్ రివ్యూకు వెళ్లకపోవడంతో బతికిపోయిన మార్క్‌రమ్ జోరు పెంచాడు. హెండ్రిక్స్‌తో కలిసి లక్ష్యాన్ని క్రమంగా కరిగించాడు. దీంతో పవర్‌ప్లేలో సౌతాఫ్రికా 36/1తో నిలిచింది. ఆ తర్వాత విజయాన్ని అందుకోవడానికి దక్షిణాఫ్రికాకు ఎక్కువ సమయం పట్టలేదు. అజ్మతుల్లా వేసిన తొమ్మిదో ఓవర్ అయిదో బంతికి హెండ్రిక్స్ బౌండరీ సాధించి జట్టును గెలిపించాడు.

Story first published: Thursday, June 27, 2024, 8:20 [IST]
Other articles published on Jun 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+