Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: కన్నీళ్లు ఆనందభాష్పాలుగా మారిన వేళ: స్టెయిన్ భావోద్వేగం (Video)

క్రికెట్ ప్రపంచంలో దురదృష్టానికి దక్షిణాఫ్రికా దగ్గరి బంధువంటూ కామెంట్లు చేస్తుంటారు. ఎందుకంటే వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా ప్రదర్శన అలానే ఉంటుంది. టోర్నీ ఆద్యంతం సత్తాచాటడం, సెమీస్‌లో తడబడటం.. ప్రొటీస్‌కు పరిపాటి. కానీ ఈ సారి సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది. సెమీస్ గండాన్ని దాటింది. ట్రిండాడ్ వేదికగా గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

వరల్డ్ కప్ చరిత్రలో దక్షిణాఫ్రికాకు ఇదే తొలి టైటిల్ పోరు. మండకొడి పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి ప్రపంచకప్ సెమీస్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా అఫ్గానిస్థాన్ కోరుకోని రికార్డు సాధించింది.అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రా రూపంలో వచ్చిన 13 పరుగులే వ్యక్తిగత స్కోరుల కంటే అత్యధిక స్కోరు.

T20 World Cup South Africa Reach Final with Win Over Afghanistan Tears Turn to Joy for Dale Steyn

సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జేన్సన్ (3/16), షంసీ (3/6) చెరో మూడు వికెట్లతో విజృంభించారు. రబాడ (2/14), నోకియా (2/7) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 8.5 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి విజయం సాధించింది. ఆదిలోనే డికాక్ (5; 8 బంతుల్లో, 1 ఫోర్) ఔటైనా రీజా హెండ్రిక్స్ (29 నాటౌట్; 25 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), మార్క్‌రమ్ (23 నాటౌట్; 21 బంతుల్లో, 4 ఫోర్లు) జట్టును విజయతీరాలకు చేర్చారు.

అయితే ఈ మ్యాచ్‌కు కామెంటరీగా వ్యవహరించిన దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ డేల్ స్టెయిన్ విజయానంతరం భావోద్వేగానికి గురయ్యాడు. సౌతాఫ్రికా మరో బౌలర్ పొలాక్ గెలుపును వర్ణిస్తుండగా స్టెయిన్ కన్నీటి పర్యంతమయ్యాడు. అతని కళ్లలో ఆనందభాష్ఫాలు స్పష్టంగా కనిపించాయి. అయితే 2015 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమిపాలైన సమయంలో స్టెయిన్ మైదానంలోనే కంటతడి పెట్టాడు. జట్టును ఫైనల్‌‌కు చేర్చలేకపోయాననే బాధతో కుమిలిపోయాడు.

T20 World Cup South Africa Reach Final with Win Over Afghanistan Tears Turn to Joy for Dale Steyn

కానీ ఈ రోజు దక్షిణాఫ్రికా ఫైనల్‌కు తొలిసారి అర్హత సాధించడంతో స్టెయిన్ కన్నీళ్లు తొమ్మిదేళ్ల తర్వాత ఆనందభాష్పాలుగా మారాయి. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే స్టెయిన్ మాత్రమే కాదు, దక్షిణాఫ్రికా ఫైనల్‌ చేరుకోవడాన్ని సఫారీ ఆటగాళ్లతో పాటు ఆ దేశ అభిమానులు ఆస్వాదిస్తున్నారు. 1992 నుంచి సెమీస్‌లోనే నిష్క్రమిస్తున్న సౌతాఫ్రికాకు మొత్తంగా ఉపశమనం లభించింది.

Story first published: Thursday, June 27, 2024, 14:59 [IST]
Other articles published on Jun 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+